ప్రజలకు కావలసిన అన్నీ సేవలను జగన్ ఒకే చోటుకు చేర్చారు.పుల్లపాడు (పెడన మండలం)

ఆగస్టు 10, (ప్రజా అమరావతి);


*ప్రజలకు కావలసిన అన్నీ సేవలను జగన్ ఒకే చోటుకు చేర్చారు.**త్వరలో రూ.40 లక్షలతో సైఫన్ నిర్మాణం, చెరువుకు రెవిట్మెంట్, స్కూల్ వరకు రోడ్డు నిర్మాణం*


*--- రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్*


రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ లను గ్రామంలోనే ఏర్పాటు చేసి, ప్రజల వద్దకే కావలసిన అన్ని సేవలను గ్రామంలో ఒకే చోటకు చేర్చారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ అన్నారు.


బుధవారం ఆయన పెడన మండలం, పుల్లపాడు గ్రామంలో రూ. 79.30  లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్ సెంటర్ల భవనాలను ప్రారంభించారు. నిర్మించిన భవనాల్లో మంత్రి కలియదిరుగుతూ, సిబ్బంది అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ఆయా భవనాల ముందు ఆయన మొక్కను నాటారు. ఆజాదికా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా మాజీ రాష్ట్రపతి వివి గిరి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి మంత్రి పూల మాలలతో నివాళులు అర్పించారు.


అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ విత్తనం నుంచి విక్రయం వరకు అన్ని సేవలు ఒకే చోట రైతు భరోసా కేంద్రాల్లోనే పొందడం, వైద్యం అవసరమైన వారికి వైఎస్సార్ వెల్ నెస్ సెంటర్లు, గ్రామ సచివాలయాల ద్వారా  మండల కేంద్రానికి వెళ్లకుండా ఉన్న చోటనే కావలసిన అవసరాలను పొందే విధంగా జగన్ మోహన్ రెడ్డి గొప్ప ఆలోచన చేశారన్నారు. అలాంటి ప్రణాళిక రూపొందించడం ఆయన దూర దృష్టికి నిదర్శనం అన్నారు. కుల, మత, ప్రాంత, పార్టీలకతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆయన సంక్షేమ పథకాలను అందజేస్తున్నారన్నారు. మన బాధలను పట్టించుకునేవాడు, ఇంట్లో కొడుకు కూతురు పట్టించుకోకపోయినా సంక్షేమ పథకాల ద్వారా మీ బాగోగులు చూసుకునేవాడు కేవలం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే అన్నారు.అలాంటి వ్యక్తిని మీ మనసులో ఆశీర్వదించాలని మంత్రి కోరారు.

అదేవిధంగా గ్రామానికి త్వరలో రూ.40 లక్షలతో సైఫన్ నిర్మాణం, చెరువుకు రెవిట్మెంట్, స్కూల్ వరకు రోడ్డు నిర్మాణం చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు.

రూ. 3 కోట్లతో జాతీయ రహదారి నుంచి పుల్లపాడుకు నూతన రోడ్డును నిర్మించామని, దమ్ము చక్రాలకు పట్టీలను నిర్మించకుండా ట్రాక్టర్లను ఆ రోడ్డుపై నిర్లక్ష్యంగా నడపవద్దని, అతిక్రమించిన వారికి రూ.25 వేలు జరిమానా విధించాలని ఎస్సైకి మంత్రి సూచించారు.

అంతకముందు గ్రామంలోకి ప్రవేశించిన మంత్రికి గ్రామస్తులు నుదుటిన తిలకం దిద్ది ఘన స్వాగతం పలికారు.

ఈ కార్యక్రమంలో పుల్లపాడు గ్రామ సర్పంచ్ జోగి నాగేశ్వరమ్మ, పెడన ఎంపీపీ రాజులపాటి వాణీ అచ్యుతరావు, ఎంపీటీసీ ఊసా అనిల్, జెడ్పీటీసీ అర్జా వెంకట నాగేష్ పెడన మార్కెట్ యార్డు చైర్మన్ గరికపాటి చారుమతి నాయుడు, ఎంపిడిఓ జె రామనాథం, తాసిల్టారు పి మధుసూదనరావు, ఏఈ ఎల్ హరిబాబు, సచివాలయ ఉద్యోగులు, గ్రామ వాలంటీర్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


Comments