నెల్లూరు, ఆగస్టు 21 (ప్రజా అమరావతి);
నగరంలో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సజావుగా ప్రశాంతంగా జరిగాయని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి వెంకటనారాయణమ్మ ఒక ప్రకటనలో తెలిపారు.
ఆదివారం నగరంలోని విఆర్ పి జి స్టడీస్ విద్యా కేంద్రంలో జరుగుతున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షలను డిఆర్ఓ ఆకస్మిక తనిఖీ చేశారు.
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని వివిధ మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులను భర్తీ చేసేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలు నిర్వహించిందన్నారు. ఈ పరీక్షలకు 167 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 109 మంది హాజరయ్యారని, 58 మంది హాజరు కాలేదని డిఆర్వో తెలిపారు.
addComments
Post a Comment