సోమవారం జిల్లా కలెక్టరేట్లో స్పందన .... కలెక్టర్ డా కే.మాధవీలతరాజమహేంద్రవరం  (ప్రజా అమరావతి);సోమవారం జిల్లా కలెక్టరేట్లో  స్పందన 


.... కలెక్టర్ డా కే.మాధవీలత
 సోమవారం  స్పందన కార్యక్రమం జిల్లా కలెక్టరేట్ లో జరుగుతుందని  జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.సోమవారం  రాజమహేంద్రవరం లోని జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజలు నుంచి స్పందన ఫిర్యాదులు స్వీకరిస్తామని తెలిపారు.  జిల్లా కలెక్టర్, జేసీ, ఇతర జిల్లా అధికారులు  ఉదయం 10.00 నుంచి మ.1.00 వరకు ఫిర్యాదులను స్వీకరిస్తామని కలెక్టర్ తెలిపారు.


ప్రతి వారం తరహాలోనే సోమవారం రాజమహేంద్రవరం రూరల్ లో హర్లిక్స్ ఫ్యాక్టరీ  సమీపంలోని ఎన్ఎసి భవనంలోని కలెక్టరేట్ నకు ఆర్టీసి బస్టాండ్ నుంచి ఉచిత బస్సు సర్వీసు ఉ.9 నుంచి మ.2 వరకు నడుపుతున్నట్లు ఆమె తెలియచేశారు.


రెవెన్యూ, మునిసిపల్, మండల, గ్రామ, వార్డు సచివాలయాలలో  స్పందన ఫిర్యాదులను అందచేయాలని కలెక్టర్ తెలియచేశారు
Comments