మంగళగిరిలో "లాల్ సింగ్ చడ్డా"చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించిన చిరంజీవి యువత...

 *మంగళగిరిలో "లాల్ సింగ్ చడ్డా"చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శించిన చిరంజీవి యువత...*

  

ప్రపంచవ్యాప్తంగా అన్ని ముఖ్య కేంద్రాలతో పాటుగా మంగళగిరి గోపాలకృష్ణ టాకీస్ లో గురువారం విడుదలైన అమీర్ ఖాన్ & కరీనా కపూర్ నటించిన మెగాస్టార్ చిరంజీవి సమర్పించిన లాల్ సింగ్ చడ్డా చిత్రాన్ని రాష్ట్ర చిరంజీవి యువత ఉపాధ్యక్షులు కంకణాల శంకర్ ఆధ్వర్యంలో ఉదయం ఆటను ఉచితంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా కంకణాల మాట్లాడుతూ భారతదేశంలో అనేక చారిత్రక అంశాలతో కూడిన కథతో రూపొందించిన ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ చూడాలనే ఉద్దేశంతో చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఉచితంగా ఉదయం ఆట ప్రదర్శించడం జరిగిందన్నారు. మన దేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా కూడా చిత్రంపై ప్రేక్షకుల నుంచి విశేష స్పందన వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి చిరంజీవి యువత అధ్యక్షుడు నీలాద్రి వంశీ సాయి, పిల్లి నాగభూషణం, కౌతరపు సుందరయ్య, సుధాకర్, రేవంత్, పి.ఆర్.పి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Comments