ప్రజారోగ్య పరిరక్షణపై ప్రత్యేకమైన శ్రద్ధ* తీసుకొని డెంగ్యు, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి,

    కె.గంగవరం,17,ఆగస్టు (ప్రజా అమరావతి); 


గ్రామ పరిసరాలను పరిశుభ్రoగా ఉంచడంతోపాటు ప్రజారోగ్య పరిరక్షణపై ప్రత్యేకమైన శ్రద్ధ* తీసుకొని డెంగ్యు, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి,


*రాష్ట్ర బిసి సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు,* సినిమాటోగ్రఫీ* *శాఖ మంత్రి* చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ*

 

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె.గంగవరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం జరిగిన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రి వేణుగోపాలకృష్ణ  ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచాలని తడి చెత్త ,పొడి, చెత్త గ్రామాలలో ఎక్కడబడితే అక్కడ రోడ్లకిరువైపులా పారబోస్తున్నారని అందువల్ల గ్రామాలు అపరిశుభ్రoగా తయారవుతున్నాయని జగనన్న స్వచ్ఛ సంకల్పం లో భాగంగా పరిశుభ్రత అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఒక ప్రణాళిక రూపొందించి తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా ఇంటింటి నుండి సేకరించి డంపు చేయుటకు అనువైన ప్రదేశాలను ఎంపిక చేసి చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల ద్వారా పంచాయతీల ఆర్థిక పరిపుష్టికి చర్యలు గైకొనాలని పంచాయతి అధికారులను ఆదేశించారు.

     అదేవిధంగా గ్రామాలలో మలేరియా, చికెన్ గునియా,డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలను అప్రమత్తం చేసి అవగాహన కల్పిస్తూ, చైతన్య పరచడంతో పాటుగా, మెరుగైన వైద్య సదుపాయాలు మందులు అందుబాటులో ఉంచుతూ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలను పటిష్టం గావించాలని,  సీజనల్ వ్యాధులు ఎక్కువగా నమోదవుతున్నచోట్ల   ప్రబలడానికి గల కారణాలు అన్వేషించి తగు నివారణ చర్యలు బలోపేతం చేయాలని వైద్య ఆరోగ్యశాఖ సిబ్బందిని ఆదేశించారు.

        వ్యవసాయానికి సంబంధించి  కౌలుదారు రైతులకు సాగులో మెలకువలు, సేంద్రీయ, రసాయన ఎరువుల వినియోగం, సాగునీటి యజమాన్యం, సస్యరక్షణ, చీడపీడల నివారణ, క్రిమిసంహారక మందులు వాడకం పై  సలహాలు సూచనలు వ్యవసాయ శాఖ అధికారులు పొలంబడి కార్యక్రమాల ద్వారా అవగాహన పెంపొందించాలన్నారు. అదేవిధంగా రైతు వారి వచ్చిన సమస్యలను వ్యవసాయ అధికారులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ,కౌలుదారుల కార్డులు సకాలంలో అందేలా చూడాలని ఈ ఖరీఫ్ పంటపై ఎలుకలు సమస్య అధికంగా ఉందని ఎలుకల నివారణ నిమిత్తం చేపట్టాల్సిన చర్యలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు.

       గ్రామాలలో దమ్ము చక్రాలతో రోడ్లపై ట్రాక్టర్లు రాకపోకలు సాగించడం వల్ల రోడ్లన్నీ పాడైపోతున్నాయని దమ్ము చక్రాలతో ఎవరైనా రోడ్లపై తిరిగితే   ఆ ట్రాక్టర్ల యజమానులకు నోటీసులు ఇచ్చి దమ్ము చక్రాలతో సంచరించకుండా చర్యలు  తీసు కోవాలని మంత్రి అన్నారు.  ఈ సమస్యను నివారించేందుకు ఆర్ అండ్ బి అధికారులు, పోలీసులు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, 

సమన్వయంతో పనిచేయాలని సూచించారు   దమ్ము చక్రాలతో ట్రాక్టర్లను  రోడ్లపై  సంచరించడం వల్ల కోట్లాది రూపాయలు వెచ్చించి నిర్మించిన రోడ్లు మన్నిక తగ్గి పాడై పోవడంతో రోడ్డు మార్గం ద్వారా పయనించే వాహనదారులకు  ఇబ్బందులు ఎదురవుతున్నాయని  మంత్రి అన్నారు. 

     ఈ కార్యక్రమంలో జడ్పిటిసి. శ్రీ వరలక్ష్మి, ఎంపీటీసీ. పి నాగ వెంకట తులసి, ఎంపీపీ. నాగమణి, ఎంపీడీవో. ఎన్. శ్రీనివాసరావు,  మార్కెట్ కమిటీ చైర్మన్ గోవిందరాజు, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, సచివాలయాల సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


Comments