నెల్లూరు ఆగస్టు 25 (ప్రజా అమరావతి);
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబం పొందిన లబ్ధిని గణాంకాలతో సహా నేరుగా ప్రజల ఇంటి వద్దకే వెళ్లి వివస్తున్నామని, ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు సంతృప్తికర స్థాయిలో అందడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ & పుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన రెడ్డి అన్నారు.
గురువారం రాత్రి పొదలకూరు మండలం డేగపూడి సచివాలయం పరిధిలోని బొంత రాజుపాలెంలో రెండోరోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కాకాణి కి గ్రామ సర్పంచ్ మండి చిన ఓబుల్ రెడ్డి ఆద్వర్యంలో గ్రామస్థులు పూలజల్లులతో స్వాగతం పలికారు.
రాత్రి సమయంలో కూడా ప్రతి ఇంటికీ వెళ్లి సంక్షేమ లబ్ది పత్రాలను ప్రజలకు అందిస్తూ గ్రామస్థులతో మంత్రి మమేకమైన తీరు అందరినీ ఆకట్టుకుంది.
అనంతరం మంత్రి మీడియా వారితో మాట్లాడుతూ పొదలకూరు ను నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (నుడా) పరిధిలో చేర్చి పట్టణాలకు దీటుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకం కింద సర్వేపల్లి నియోజకవర్గంలో పేదలందరికీ ఇళ్లు నిర్మించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. తమ ప్రభుత్వం మూడేళ్ల పాలనలో సంక్షేమం, అభివృద్ధికి పెద్దపీట వేసినట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి తెనాలి నిర్మలమ్మ, మండల వైస్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీటీసీ పులి వెంకటేశ్వర్లు, సర్పంచ్ చిన ఓబుల్ రెడ్డి, రామలింగారెడ్డి, స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గోన్నారు.
addComments
Post a Comment