ప్రజల్లో దేశభక్తి భావం, జాతీయ పతాకం పట్ల అవగాహన పెంపొందించలి

 

నెల్లూరు (ప్రజా అమరావతి);


దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో ప్రజల్లో దేశభక్తి భావం,  జాతీయ పతాకం పట్ల అవగాహన పెంపొందించ


డానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ పేర్కొన్నారు. 



సోమవారం  ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం సందర్బంగా  స్థానిక గాంధీ బొమ్మ వద్ద గాంధీజీ విగ్రహానికి జిల్లా పరిషత్ చైర్  పర్సన్ శ్రీమతి  ఆనం అరుణమ్మ, జిల్లా పరిషత్ సీఈవో శ్రీమతి  వాణి,  జిల్లా పంచాయతీ అధికారి  శ్రీమతి ధనలక్ష్మి, తదితరులు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.  అనంతరం ఏర్పాటుచేసిన ర్యాలీని  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ జెండా ఊపి ప్రారంభించారు.  ఈ ర్యాలీ  గాంధీ బొమ్మ వద్ద నుండి పెద్ద ఎత్తున వివిధ శాఖల జిల్లా అధికారులు,  మునిసిపల్ కార్పొరేషన్ సిబ్బంది, వార్డు సచివాలయాల సిబ్బందితో జిల్లా కలెక్టరేట్ వరకు ప్రదర్శన నిర్వహించారు.   అనంతరం  కలెక్టరేట్ ఆవరణంలో  గల  గాంధీజీ విగ్రహానికి జిల్లా పరిషత్ చైర్  పర్సన్ శ్రీమతి  ఆనం అరుణమ్మ పూలమాలవేసి నివాళులర్పించారు. 


ఈ  సందర్బంగా  కలెక్టరేట్ ఆవరణంలో  ఏర్పాటుచేసిన సభలో జిల్లా పరిషత్ చైర్  పర్సన్ శ్రీమతి  ఆనం అరుణమ్మ మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో  ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో  భాగంగా  ప్రజల్లో దేశభక్తి భావం,  జాతీయ పతాకం పట్ల అవగాహన పెంపొందించడానికి ఆగస్టు నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా  నిర్వహించడం జరుగుతుందన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా  మొదటి రోజు  గ్రామ/వార్డు  సచివాలయాల ద్వారా ప్రజల్లో దేశభక్తి భావం,   పెంపొందించేల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చైర్ పర్సన్ శ్రీమతి అరుణమ్మ  తెలిపారు.



జిల్లా పరిషత్ సీఈవో శ్రీమతి  వాణి,  జిల్లా పంచాయతీ అధికారి  శ్రీమతి ధనలక్ష్మి, సోషల్ వెల్ఫేర్ ఉప సంచాలకులు శ్రీమతి రమాదేవి,  జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీ  సుధాకర్  రాజు, డి.ఎస్.డబ్ల్యూ.ఓ శ్రీ  వెంకటయ్య తదితరులు మాట్లాడుతూ, ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో  భాగంగా   ఈ నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో  విస్తృతంగా  నిర్వహించేందుకు 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ప్రతి రోజు చేపట్టాల్సిన కార్యక్రమాలను రూపొందించడం జరిగిందన్నారు.  ఈ రోజు గ్రామ/వార్డు  సచివాలయాల ద్వారా ప్రజల్లో దేశభక్తి భావం,   పెంపొందించేల కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.


ఈ సంధర్భంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ప్రతి రోజు చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రచురించిన కరపత్రాన్ని జిల్లా పరిషత్ చైర్ పర్సన్  శ్రీమతి అరుణమ్మ ఆవిష్కరించారు. 


ఈ కార్యక్రమంలో  ఇంచార్జీ నెల్లూరు మున్సిపల్ కమీషనర్ శ్రీ చెన్నుడు, మెప్మా పి.డి శ్రీ రవీంద్ర, సమాచార పౌర సంబంధాల అధికారి శ్రీ వేంకటేశ్వర ప్రసాద్, డి.సి.ఓ శ్రీ తిరుపాల్ రెడ్డి, సెట్నల్ సి.ఈ.ఓ శ్రీ పుల్లయ్య, కార్మిక శాఖ డిప్యూటీ కమీషనర్ శ్రీ వెంకటేశ్వర్లు,  దివ్యాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు శ్రీమతి నాగ రాజకుమారి, మత్స్య శాఖ జెడి శ్రీ నాగేశ్వర రావు,  నెల్లూరు నగర తహశీల్దార్ శ్రీ నిర్మలానంద బాబు, కార్పోరేషన్ పరిధిలోని సచివాలయ సిబ్బంది, విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు. 




Comments