ప్రజలకిచ్చిన వాగ్ధానం మేరకు అన్ని పధకాలు అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమది


నెల్లూరు ఆగస్టు 10 (ప్రజా అమరావతి);


ప్రజలకిచ్చిన వాగ్ధానం మేరకు అన్ని పధకాలు అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తమద


ని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ & పుడ్ ప్రాసెసింగ్ శాఖామాత్యులు  శ్రీ కాకాణి గోవర్ధన రెడ్డి అన్నారు. 


బుధవారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గం వెంకటాచలం మండలం కందలపాడు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని  నిర్వహించారు.  ఇందులో  పాల్గోనేoదుకు వచ్చిన మంత్రి కాకాణి కి అభిమానులు, ప్రజలు పూలజల్లులు  కురిపిస్తూ ఆత్మీయ స్వాగతం పలికారు. తోలుత ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా మాజీ రాష్ట్రపతి శ్రీ వి వి గిరి జయంతి సంధర్బంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి మంత్రి ఘనంగా నివాళులు అర్పించారు. 


ఈ సంధర్బంగా మంత్రి మాట్లాడుతూ, పేద బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. కేవలం అర్హతే ప్రామాణికంగా ఎటువంటి రాజకీయ జోక్యం లేకుండా నేరుగా లబ్దిదారుల అకౌంట్లలో నగదు జమ చేయడం జరుగుతుందన్నారు. ఇంకా ఎవరైనా అర్హత గల వారు మిగిలిపోయినా, సాంకేతిక కారణాలతో లబ్ది పోందలేకపోయినా, అటువంటి వారిని గుర్తించి వారికి సహాయం చేసేందుకే గడప గడప కు మన ప్రభుత్వం అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. అదేవిధంగా గ్రామాల్లోని అభివృద్ధి, మౌలిక వసతుల పరిశీలనకు వేదికగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. సచివాలయ వ్యవస్థ ఏర్పాటు ద్వారా ప్రభుత్వ పాలన ప్రజలకు చేరువైందన్నారు. కింది స్థాయి నుండి పై స్థాయి వరకూ అధికారులు, సిబ్బంది జవాబుదారీతనంతో పని చేస్తున్నారని ప్రశంసించారు. 


కందలపాడు గ్రామంలో ఇంటింటికి మంత్రి కాకాణి  గోవర్ధన్ రెడ్డి వెళ్ళినప్పుడు,  ప్రతి ఇంటిలో హారతులు ఇవ్వడం, దిష్టి తీయడం, దీవించడం విశేషంగా కనిపించింది. వారి అభిమానం వెలిబుచ్చిన తీరు చూపరులను ఆకట్టుకుంది. 


ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వల్లూరు లక్ష్మమ్మ, ఎంపీడీవో సుస్మిత, తహాసిల్దార్ నాగరాజు, సచివాలయ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గోన్నారు. Comments