గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుంది

 

నెల్లూరు, ఆగస్టు 19 (ప్రజా అమరావతి): గడపగడపకు మన ప్రభుత్వం  కార్యక్రమానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుంద


ని, గ్రామాల్లో తిరుగుతున్నప్పుడు ప్రతి ఇంటికి ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ది చేకూరడమే తమ ప్రభుత్వ పారదర్శకతకు, సంతృప్తికర పాలనకు నిదర్శనమని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పునరుద్ఘాటించారు. 

 శుక్రవారం సాయంత్రం సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లిగూడూరు మండలం ఇస్కపాలెం గ్రామంలో నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందజేసిన సంక్షేమ పథకాలు సంతృప్తిగా అందాయా, లేదా అని తెలుసుకుని వారు పొందిన సంక్షేమ పథకాల వివరాలతో కూడిన బుక్లెట్ ను మంత్రి అందించారు. తమ ఇళ్లకు పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వాలని స్థానిక మహిళలు కోరగా, వెంటనే స్పందించిన మంత్రి రేపటిలోగా పొజిషన్ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, కాలువలు, మంచినీటి ఇబ్బంది లేకుండా చేశామని, ఇంకా ఏమైనా సమస్యలు మిగిలి ఉంటే తమ దృష్టికి తీసుకొచ్చిన వెంటనే పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఏవైనా సాంకేతిక కారణాలతో సంక్షేమ పథకాలు అందని వారి వివరాలు సేకరించి, అర్హత ఉంటే ఆ కుటుంబాలకు కూడా ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా గడపగడపకు మన ప్రభుత్వం వంటి వినూత్న కార్యక్రమానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారన్నారు. వార్డు కౌన్సిలర్ నుంచి మంత్రి స్థాయి వరకు గ్రామాల్లో పర్యటించి పూర్తిస్థాయిలో ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ ఫలాలను అందించడమే ధ్యేయంగా పని చేస్తున్నట్లు చెప్పారు. సర్వేపల్లి నియోజకవర్గంలో త్వరలోనే ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ అందిస్తామని, కుళాయి కనెక్షన్లు ఇచ్చేందుకు  అవసరమైన అన్ని చర్యలు చేపట్టామని, అదనంగా మరో 14 కోట్ల రూపాయలను కూడా మంజూరు చేశామని చెప్పారు. ప్రజలకు సంతృప్తికర స్థాయిలో సంక్షేమ పథకాలను అందించామని, రానున్న రెండేళ్ల కాలంలో కూడా సమర్థవంతమైన పరిపాలనను ప్రజలకు అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. 

 తొలుత గ్రామానికి విచ్చేసిన మంత్రికి స్థానిక ప్రజా ప్రతినిధులు ఘన స్వాగతం పలకగా, స్థానికంగా గ్రామీణ నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో 5 లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ను మంత్రి చేతుల మీదుగా ప్రారంభించారు. 

 ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఉప్పల స్వర్ణలత, జెడ్ పి టి సి శేషమ్మ, ఎంపీడీవో శ్రీమతి హేమలత, తాసిల్దార్ శ్యామలమ్మ, సర్పంచ్ వెంకట చైతన్య కుమార్, ఎంపీటీసీ శీనయ్య, ప్రజా ప్రతినిధులు ఎంబేటి సంధ్యారాణి, తాని తిరుపతి, చిల్లకూరు సుధీర్ రెడ్డి, ఉప్పల శంకరయ్య గౌడ్, కాయల మణి, చిరంజీవి, మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 

Comments