దొంగతనం కేసును చేదించి ముద్దాయిలను పట్టుకున్న రూరల్ సీఐ,. ఎస్ఐ

  తెనాలి (ప్రజా అమరావతి);



    తెనాలి ఎస్ డి పి ఓ కార్యాలయంలో బుధవారం ఎస్ డి పి ఓ స్రవంతి రాయ్ మీడియాతో మాట్లాడుతూ కొల్లిపర గ్రామంలో జరిగిన దొంగతనం గురించి తెలియజేస్తూ భీమవరపు మీనా కుమారి భర్త గురువారెడ్డి వయస్సు 58 సంవత్సరములు కులము రెడ్డి వారి యొక్క ఇంటిలో ఎక్కువ మొత్తం డబ్బులు ఉన్నాయని సమాచారం తెలుసుకోని వాటిని ఎలాగైనా వారి వద్ద నుండి దొంగతనం చేయాలనే ఉద్దేశంతో  ఒక పథకం ప్రకారం A1. షేక్ అప్సర్ బాబు, తండ్రి రహీం, వయస్సు 38 సంవత్సరాలు, కులము ముస్లిం కొల్లిపర గ్రామం మరియు మండలం,  A2. ముద్దాయి నూతక్కి జగదీష్ ప్రసాద్, తండ్రి, కొండయ్య, వయస్సు 38 సంవత్సరములు, కులము రజక, కురుమద్దాలి, గ్రామము పామరు మండలం, కృష్ణా జిల్లా.  A3. ముద్దాయి పల్లపు. ఓనేష్, తండ్రి డేవిడ్, వయస్సు 32 సంవత్సరములు, కులము వడ్డెర, నడికుడి గ్రామం, దాచేపల్లి మండలం, పలనాడు జిల్లా.A4. ముద్దాయి బస్సా. మాణిక్యరావు, తండ్రి ఐజాక్, 36 సంవత్సరాలు, వలివేరు గ్రామం, చుండూరు మండలం, బాపట్ల జిల్లా. A5. కోడూరు. సునీల్ కుమార్, తండ్రి ఇంద్రాద్రి మురళి మోహనకృష్ణ, వయస్సు 30 సంవత్సరాలు, కులం బ్రాహ్మణ, నారాకోడూరు గ్రామం, చేబ్రోలు మండలం, గుంటూరు జిల్లా. A6. చావలి. సాంబశివరావు, తండ్రి సుబ్బారావు, వయస్సు 38 సంవత్సరాలు, నున్న గ్రామం, గన్నవరం మండలం, కృష్ణా జిల్లా. A7. షేక్. జబి, తండ్రి అల్లా బక్షు, వయస్సు 32 సంవత్సరాలు, కులం ముస్లిం, నున్న గ్రామం, గన్నవరం మండలం, కృష్ణాజిల్లా. A8. గోవాడ. కిరణ్, తండ్రి మూర్తి, వయసు 25 సంవత్సరాలు, కులం రజక, మిర్యాలగూడ గ్రామం మరియు మండలం, తెలంగాణ రాష్ట్రము.A9. సిరికొండ. శ్రవణ్, తండ్రి రాములు, వయస్సు 22 సంవత్సరాలు, కులము రజక, నకరికల్లు గ్రామం మరియు మండలం, నల్గొండ జిల్లా. మిగతా ముద్దాయిలు అందరితో కలిసి 20.7. 2022వ తేదీ రాత్రి సుమారు ఒంటిగంట సమయంలో అందరు ముద్దాయిలు కలిసి రెండు కార్లులలో రెండు గ్రూపుల్లాగా బయలుదేరి ఒక కారులో కొందరు కలిసి ఎస్బిఐ ఎటిఎం ఎదురు సందులో ఆపుకొని ఉండగా మరియొక కారులో ఉన్న అప్సర్ మరియు మిగతా ముద్దాయిలు అందరూ కలసి వచ్చి ఫిర్యాది ఇంటి ముందు కారు ఆపి మరియు ఫిర్యాది ఆమె భర్త నిద్రపోయే సమయంలో ఎవరు చూడకుండా ఇంటిలోనికి ప్రహరీ గోడ దూకి ఇంటిలోనికి  వెళ్లి మెస్ డోర్ ని కత్తిరించి లోపల ఒక గదిలో వెళ్లి అలమరలో ఉన్న పది లక్షల నల్లని బ్యాగ్ని తీసుకొని దానితో పాటుగా అక్కడే ఉన్న బంగారపు నెక్లెస్ ఒకటి, మరియు ఒక జత చెవి దిద్దులు తీసుకొని అక్కడ నుండి ముద్దాయిలు అందరూ కలిసి రెండు కారులలో బయలుదేరి శివలూరు గ్రామ శివారులో ఆపుకొని ఆ దొంగిలించిన నల్లని బ్యాగుని తెరిచి చూడగా దానిలో ఉన్న డబ్బు పది లక్షల రూపాయలను అందరూ వాటాలు వేసుకొని అవి ఇప్పుడే పంచుకుంటే దొరికిపోతాము అని తెలిసి తరువాత పంచుకుందాము అని మాట్లాడుకుని వెళ్లిపోయి తిరిగి అప్సర్ ఒకరోజు పైన తెలియజేసిన ముద్దాయిలందరకు ఫోన్ ద్వారా మరల మరొక నేరము చేయాలి అని చెప్పి తెనాలి మండలం నందివెలుగు జంక్షన్ కి పైన తెలియజేసిన రెండు కారులలో వచ్చి నేరము గురించి మాట్లాడుకొనుచుండగా తెనాలి రూరల్ సీఐ అయినా శ్రీ ఎం. సుబ్రహ్మణ్యం, కొల్లిపర ఎస్సై. ఆర్. రవీంద్రారెడ్డి రాబడిన సమాచారము మేరకు శ్రీ తెనాలి డీఎస్పీ మేడమ్ గారి పర్యవేక్షణలో శ్రీ ఎస్పీ గారి ఆదేశాల మేరకు పైన తెలుపబడిన అప్సర్ మరియు మిగతా అందరూ ముద్దాయిలను పట్టుకొని అరెస్టు చేయడమైనది. వారి వద్ద నుండి 8:30 లక్షలు నగదు, బంగారపు నక్లెస్ ఒకటి, చెవి దిద్దులు ఒక జత,  మారుతి ఎర్టిగా కార్స్ రెండు, సెల్ఫోన్స్ 8 స్వాధీన పరచుకోవడం అయినది. ముద్దాయిలను తెనాలి రూరల్ సీఐ, సుబ్రహ్మణ్యం 10. 8. 2022న మధ్యాహ్నం ఒంటిగంటకు అరెస్టు చేయడమైనది. ఈ కేసు కేసును తొందరగా చేదించిన రూరల్ సీఐ, కొల్లిపర ఎస్సై ను, పోలీసు సిబ్బందిని  డిఎస్పి అభినందించినారు.

Comments