*సిపిఎస్ పై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో మంత్రుల కమిటీ సమావేశం*
*•సుదీర్ఝంగా 5 గంటల పాటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో జరిగిన చర్చలు*
*•పలు దఫాలుగా చర్చలు జరిపి ఈ సమస్యకు ముగింపు పలకాలని నిర్ణయం*
అమరావతి, ఆగస్టు 18 (ప్రజా అమరావతి): ఉద్యోగుల కంట్రిబ్యూటరీ ఫెన్సన్ స్కీమ్(సిపిఎస్)అంశంపై గురువారం అమరావతి సచివాలయం రెండవ బ్లాకులో రాష్ట్ర విద్యశాఖమంత్రి బొత్స సత్యనారాయణ,రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు)సజ్జల రామకృష్ణా రెడ్డిల ఆధ్వర్యంలో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశం జరిగింది. సుదీర్ఝంగా సుమారు 5 గంటల పాటు జరిగిన ఈచర్చల్లో అన్ని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత ఫించన్ విధానం(ఓపిఎస్)నే అమలు చేయాలని మంత్రుల కమిటీకి స్పష్టం చేశారు. ఉద్యోగులకు అన్ని విధాలుగా మేలు చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉందని మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. అయితే పలు దఫాలుగా చర్చలు జరిపి ఈ సమస్యకు త్వరలోనే ఒక ముగింపు పలకాలని ఇరుపక్షాలు నిర్ణయంతీసుకోవడం జరిగింది.
ఈసమావేశంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ సిపిఎస్ విధానం నుండి పాత ఫించన్ విధానాన్ని అమలు చేస్తే ప్రభుత్వంపై భవిష్యత్తులో ఎంత మేరకు ఆర్ధిక భారం పడుతుందనే దానిపై అధికారులు కసరత్తు చేశారని ఆ అంశాలను ఉద్యోగులతో సంప్రదించేందుకు ఈసమావేశాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఒక్కరోజులో సిపిఎస్ పై నిర్ణయం తీసుకునేందుకు అవకాశం లేదని పలు దపాలుగా ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించిన మీదట ఏమి చేయాలనే దానిపై ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వo ఉద్యోగులకు ఎంతమాత్రం వ్యతిరేకం కాదని కాని రాష్ట్ర ఆర్ధిక పరిస్థితులు,అన్నివర్గాల సంక్షేమాన్నిదృష్టిలో ఉంచుకుని ఈఅంశంపై తగిన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఇందుకు అన్ని ఉద్యోగ సంఘాలు కూడా ప్రభుత్వానికి పూర్తిగా సహకరించాలని ఆయన కోరారు.
ఈసమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి(హెచ్ఆర్)చిరంజీవి చౌదరి,ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్.గుల్జార్,జిఏడి కార్యదర్శి(సర్వీసెస్ మరియూ హెచ్ఆర్)హెచ్.అరుణ్ కుమార్, ప్రభుత్వ(సలహాదారు ఉద్యోగుల సంక్షేమం) ఎన్.చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. అలాగే ఉద్యోగ సంఘాల తరపున ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు,ఏపీ సెక్రటేరియట్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకట్రామిరెడ్డి,ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షులు కె.ఆర్ సూర్యనారాయణ, ఏపిఎస్ఆర్టీసీ ఉద్యోగ సంఘాల అధ్యక్షులు వై.వి.రావు, ఎపిజిఇఏ తరుపున ఎల్వి యుగంధర్, ఎపి సిపిఎస్ ఉద్యోగుల సంఘం తరుపున సతీష్ కుమార్, ఎపిటిఎఫ్, యుటిఎఫ్, ఎస్టియు తదితర ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు, ఇతర ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఈసమావేశంలో పాల్గొన్నారు.
addComments
Post a Comment