ఉపాధి హామీ అమలుకు పది సూత్రాలు

 ఉపాధి హామీ అమలుకు  పది సూత్రాలు



      పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్.

 తాడేపల్లి (ప్రజా అమరావతి);       చిత్తశుద్ధి, ప్రణాళిక బద్ధమైన పనితీరు, పరిపూర్ణ నాయకత్వ లక్షణాలతో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు పర్చి అన్ని సూచికలలో  రాష్ట్రాన్ని దేశంలోనే ప్రధమ స్థానంలో నిలపాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్ పిలుపునిచ్చారు. గ్రామీణాభివృద్ధి శాఖ అధ్వర్యంలో జిల్లాల పునర్విభజన అనంతరం 26 జిల్లాల పిడి, డ్వామాల తొలి సమావేశాన్ని తాడేపల్లిలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో బుధవారం  నిర్వహించారు. నూతన జిల్లాలతో పాటు అనేక జిల్లాలకు కొత్తగా పిడి, డ్వామాలు బాధ్యతలు స్వీకరించడ౦తో వారందరికి పథకంలోని వివిధ అంశాల పట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ సమావేశాన్ని నిర్వహించారు.

  ఈ సందర్భంగా కమిషనర్ కోన శశిధర్ మాట్లాడుతూ వేతనదారుల డిమాండ్ మేరకు పనుల కేటాయింపు, పూర్తి వేతనం రూ. 257/- పొందేలా మార్కింగ్, సకాలంలో వేతన చెల్లింపు, ప్రతి పనికి సమాచార బోర్డ్ ఏర్పాటు వంటి పనికి పది సూత్రాలను నిర్దేశించుకుంటూ ఎలాంటి మొహమాటాలకు తావులేకుండా విధాన పర నిర్ణయాలు తీసుకుంటూ ప్రతిభావంత౦గా, సమర్ధవంత౦గా ఉపాధి హామీ పనులను చేపట్టాలని అన్నారు. సమయం వృధా కాకుండా నియమ నిబంధనలకు లోబడి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ క్షేత్ర స్థాయి వరకు వెళ్లి పనిచేయాలని అంటూ జిల్లా పనితీరు మెరుగైతే  రాష్ట్రా పనితీరు మెరుగై దేశంలో ప్రధమ స్థానం సాధించడం సులభమని కమిషనర్ జిల్లా పిడిలకు  వివరించారు.  

రాష్ట్రస్థాయి నుంచి మండల స్థాయి వరకు ఉన్న అధికారులు అందరు క్షేత్ర పర్యటనలు ముమ్మరం చేయాలని, కూలీల బతుకుల్లో మార్పు తీసుకు వచ్చేలా వారి నైపుణ్యాలు పెంచే దిశగా ఆలోచనలు చేసి పిడిలు మరింత మెరుగ్గా పనిచేయాలని ఆయన చెప్పారు. పచ్చదనం పెంపు పనుల మీద దృష్టి సారించాలని, ప్రతి ఎంపిడిఓ గ్రామాలను దత్తత తీసుకుని వాటిని  అభివృద్ధి పర్చేలా చర్యలు తీసుకోవాలని, చేసే ప్రతి పని ఉపయోగపడేలా ఉండాలని, గతంలో జిల్లాలో జరిగినవన్ని తెలుసుకుంటూ, ప్రతి ఆస్తి కల్పన ద్వారా  లబ్దిదారునికి  లాభం ఉండేలా కృషి చేయాలని, ఎప్పటికప్పుడు  క్షేత్ర పర్యటనలు చేయాలని కమిషనర్ సూచించారు. రాష్ట్రానికి  గ్రామీణాభివృద్ధి శాఖ గుండెకాయ వంటిదని, గ్రామీణ నిరుపేద కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగు పర్చాలని భావించే గౌరవ ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా, ఆయన మార్గదర్శకత్వంలో 26 జిల్లాల పిడి, డ్వామాలు ఉపాధి హామీ పథకాన్ని అమలు పర్చాలని కమిషనర్ కోరారు.  ఆయా సూచికల ఆధారంగా ప్రతి జిల్లా పనితీరును సమీక్షించి గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా రాష్ట్రస్థాయి అవార్డులను అందజేస్తామని ఈ సందర్భంగా  పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కోన శశిధర్ తెలిపారు.  

 

ఈ సమావేశంలో ఇజిఎస్ సంచాలకులు పి.చినతాతయ్య మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం అమలులో దేశం మొత్తం మన రాష్ట్రం వైపు చూస్తోందని, గ్రామీణాభివృద్ధి శాఖాలో  అనుభవం, నిబద్ధత ఉన్న అధికారులు ఎంతో మంది ఉన్నారని, వారందరూ నిజ శక్తితో పనిచేసినట్లయితే దేశంలోనే ప్రధమ స్థానంలో నిలుస్తామని అన్నారు. ఇకపై ప్రతి నెలా నిర్దేశిత సూచికలకు అనుగుణంగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని, రాబోయే మూడు నెలల కాలాన్ని ఒక సవాలుగా తీసుకుని నిబద్ధతతో పనిచేసి దేశస్థాయిలో ఆదర్శంగా, మార్గదర్శకంగా నిలవాలని పిడి, డ్వామాలను కోరారు. ఉపాధి హామీ మాస్టర్ సర్క్యులర్ ను ఒక ఖురాన్, ఒక బైబిల్, ఒక భగవద్గీతలా భావించి అందులోని ప్రతి అంశాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలని  ఇజిఎస్ సంచాలకులు పి.చినతాతయ్య కోరారు.      


ఈ సమావేశంలో ఇజిఎస్ జాయింట్ కమిషనర్లు ఎం. శివ ప్రసాద్, విజయ లాజరస్ లు ఉపాధి హామీ చట్టం, హక్కులు అనుమతించిన పనులు, వివిధ శాఖలతో అనుసంధానం, వివిధ స్థాయి అధికారుల పాత్ర- విధులు, అమలు విధానం, జిఐఎస్ సెక్యూర్ వంటి పలు అంశాలపై పిడి, డ్వామాలకు అవగాహన కల్పించారు. ఇంకా ఈ సమావేశంలో ఇజిఎస్ వివిధ స్థాయి అధికారులు  తదితరులు పాల్గొన్నారు.

Comments
Popular posts
ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ సెక్రటేరియట్‌లోని 228 మంది ఉద్యోగులను డిస్మిస్‌ చేస్తూ హైకోర్టు నిర్ణయం సరైనదేనని పేర్కొంది.
Image
ఇంటర్నెట్‌లో గూగుల్ సెర్చ్‌లో సైబర్ క్రైమ్ కేసులు పెరుగుతున్నాయి.
Image
న్యాయప్రక్రియకు..రాజ్యాంగపరమైన చట్టాలకు లోబడి వికేంద్రీకరణ చేయబోతున్నాం.
Image
*ఆంథ్ర రత్న జయంతి జూన్ 2* *స్వాతంత్ర్య పోరాటయోధుడు, ఉపాధ్యాయుడు,చీరాల పేరాల ఉద్యమనాయకుడు గాంధేయవాది మన తెలుగువాడు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జయంతి జూన్ 2.* *కృష్ణా జిల్లా, పెనుగంచిప్రోలు గ్రామంలో 1889 జూన్ 2 న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య జన్మించాడు. ఆయన పుట్టిన మూడవ రోజునే తల్లి సీతమ్మ, మూడో ఏట తండ్రి కోదండ రామస్వామి మరణించారు. అప్పటినుండి పినతండ్రి, నాయనమ్మల సంరక్షణలో పెరిగాడు. కూచిపూడిలోను, గుంటూరులోను ప్రాథమిక విద్య జరిగింది. హైస్కూలులో చదివే సమయంలోనే 'జాతీయ నాట్య మండలి' స్థాపించి సంగీత, నాటక కార్యక్రమాలు నిర్వహించాడు. అయితే చదువుపై అంత శ్రద్ధ చూపకపోవడంచేత మెట్రిక్యులేషనులో తప్పాడు. తరువాత బాపట్ల లో చదివి ఉత్తీర్ణుడయ్యాడు*. *నడింపల్లి వెంకటలక్ష్మీ నరసింహారావు అనే ఒక మిత్రుని సాయంతో 1911లో స్కాట్లండు లోని ఎడింబరో విశ్వ విద్యా లయంలో ఎం.ఎ. చదివాడు*. *తరువాత ఆనంద కుమార స్వామి తో కలసి కొంతకాలం పనిచేశాడు. ఆ సమయంలో 'నందికేశ్వరుడు' రచించిన 'అభినయ దర్పణం' అనే గ్రంథాన్ని “The Mirror of Gesture,” అన్న పేరుతో సంస్కృతం నుండి ఆంగ్లంలోకి అనువదించాడు. ఇది 1917లో 'కేంబ్రిడ్జ్ - హార్వర్డ్ యూనివర్శిటీ ప్రెస్' వారిచే ప్రచురించబడింది.* *తిరిగివచ్చాక, రాజమండ్రి లోను, బందరు లోను కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. తన స్వతంత్ర భావాల కారణంగా పైవారితో పడక ఆ ఉద్యోగాలు వదలిపెట్టాడు. తరువాత గోపాల కృష్ణయ్య స్వాతంత్ర్య సంగ్రామం లో దూకాడు*. *బ్రిటీష్ ప్రభుత్వం 1919లో చీరాల-పేరాల గ్రామాలను కలిపి పురపాలక సంఘంగా చేయడంతో ప్రజలపై పన్నుల భారం అధికమై పురపాలక సంఘం రద్దు చేయాలని ఉద్యమించారు. ప్రస్తుతం ప్రకాశం జిల్లా లో ఉన్న చీరాల, పేరాల గ్రామాల జనాభా ఆ కాలంలో 15000. జాండ్రపేట, వీరరాఘవపేట గ్రామాలను చీరాల, పేరాలతో కలిపి చీరాల యూనియన్ అని వ్యవహరించే వారు. ఈ యూనియన్ నుంచి ఏడాదికి నాలుగు వేల రూపాయలు వసూలయ్యేవి. మద్రాసు ప్రభుత్వం 1919 లో చీరాల-పేరాలను మున్సిపాలిటీగా ప్రకటించింది. పన్ను ఏడాదికి 40,000 రూపాయలయ్యింది. సౌకర్యాలు మాత్రం మెరుగు పడలేదు. ఇక్కడ ఉన్న నేతపని వారు, చిన్నరైతులు పన్ను చెల్లించలేక మున్సిపాలిటీని రద్దు చేయాలని ప్రభుత్వానికి ఎన్నో వినతి పత్రాలు సమర్పించారు. ఫలితం లేదు. దాంతో వారు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నాయకత్వంలో ఆందోళన ప్రారంభించారు. ఇది స్వాతంత్ర్య పోరాటంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ఆంధ్ర దేశం అంతా తిరిగి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ప్రచారం చేశాడు. నిషేధాన్ని ఉల్లంఘించి బరంపురంలో ఉపన్యాసం చేసినందుకు ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష అనుభవించాడు.చీరాల పేరాల ఉద్యమం -మద్రాస్ ప్రసిడెన్సీని కంపింపజేసింది.. ఆ ఉద్యమం మిగతా ప్రాంతాలకు వ్యాపిస్తుందేమోనని ఆంగ్లేయపాలకులు భయకంపితులయినారు..చివరికి జాతీయకాంగ్రీసు జోక్యంతో ఉద్యమం ముగిసింది...* *తెలుగు నాట జానపద కళా రూపాల పునరుద్ధరణకు, గ్రంథాలయాల వ్యాప్తికి గోపాలకృష్ణయ్య ఇతోధికంగా కృషి చేశాడు. 'సాధన' అనే పత్రిక నడిపాడు*. *ఆయన ప్రచారం చేసిన జానపద కళారీతులు - తోలుబొమ్మలాట, జముకుల కథ, బుర్రకథ, వీధి నాటకాలు, సాము గరిడీలు, గొల్ల కలాపం, బుట్ట బొమ్మలు, కీలు గుర్రాలు, వాలకాలు, గోసంగి, గురవయ్యలు, సరదా కథ, కిన్నెర కథ, కొమ్ము బూర,జోడు మద్దెల, పల్లె సుద్దులు, తూర్పు భాగోతం, చుట్టు కాముడు, పిచ్చికుంట్లవాళ్ళ కథ, సాధనా శూరులు, పలనాటి వీర విద్యావంతులు - వగైరా* *గోపాలకృష్ణయ్య నియమ తత్పరుడు. 'శ్రీరామదండు' అనే ఆధ్యాత్మిక, జాతీయతా స్వచ్ఛంద సమూహాన్ని ఏర్పాటు చేశాడు.* *1921 లో గుంటూరులో ఒక సభలో "ఆంధ్ర రత్న" అన్న బిరుదుతో ఆయనను సత్కరించారు.* *ఈ మహనీయుని త్యాగాలకు తెలుగుజాతి సర్వదా ఋణపడివుంది*. *ఉపాధ్యాయ సేవా కేంద్రం,విజయవాడ*
Image
ఒక్క ఇల్లూ కట్టని చిన్న సైకో ఆర్కే ఇళ్లు కూల్చేస్తున్నాడు
Image