*3 ఏళ్లలో కనీసం 3 పరిశ్రమలయినా తెచ్చారా జగన్ రెడ్డి ?*
*తప్పుడు ప్రచారంతో ప్రజల్ని ఇంకెన్నాళ్లు మోసం చేస్తావ్ జగన్ రెడ్డి ?*
- *కింజరాపు అచ్చెన్నాయుడు*
రాష్ర్టంలో ఉన్న పరిశ్రమలని వెళ్లగొట్టడం, కక్ష్య సాధింపుతో ఉన్న బిల్డింగులు పడగొట్టడం తప్ప ముఖ్యమంత్రి జగన్ రెడ్డి 3 ఏళ్లలో సాధించిందేంటి ? ముఖ్యమంత్రి గత 3 సంవత్సరాలలో ...98 పెద్ద పరిశ్రమలు 39350 కోట్ల పెట్టుబడితో స్థాపించబడి 60541 మందికి ఉద్యోగాలు కల్పించామని, 31671చిన్న పరిశ్రమలు ద్వారా 8285 కోట్ల పెట్టుబడితో 198521 ఉద్యోగాల కల్పన జరిగిందని చెప్పారు. కానీ, ఆర్ధిక సర్వే గణాంకాల ప్రకారం ఏప్రిల్ 2019 నుండి డిసెంబర్ 2021 వరకు పెద్ద పరిశ్రమలు 33560 మరియు చిన్న పరిశ్రమలు 148809 ఉద్యోగాలు మాత్రమే కల్పించినట్లు ఉంది.
సుమారు 70000 ఉద్యోగాలు తేడా ఈ 6 నెలలలో ఇన్ని ఉద్యోగాలు వచ్చాయా? కేంద్రం లెక్కల ప్రకారం కేవలం 20200 కోట్లు మాత్రమే రాష్ట్రం లో పెట్టుబడులు అలాగే 2021 లో విదేశీ నిధులు మన రాష్ట్రానికి 178 మిలియన్ డాలర్లు వస్తే, కర్ణాటక కు 18554 మిలియన్ డాలర్లు, తెలంగాణ కు 1585 మిలియన్ డాలర్లు వచ్చాయి.
ఇన్ని ఉద్యోగాలు వస్తే రాష్ట్రం బీహార్ తో పాటు డిగ్రీ ఉన్నవారిలో 33 శాతం నిరుద్యోగం తో ఎలా ఉంటుంది.
ప్రభుత్వం డేటా ను ప్రజలకు అందుబాటులో ఉంచితే నమ్మే అవకాశం ఉంటుంది.
చంద్రబాబు తెచ్చిన పరిశ్రమలను జగన్ రెడ్డి తెచ్చినట్టు తప్పుడు ప్రచారం చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు పరిశ్రమలకు భూములు కట్టబెడుతున్నాడని నాడు విషప్రచారం చేసిన జగన్ రెడ్డి నేడు అదే భూముల్లో శంకుస్దాపనలు ఎలా చేస్తున్నారు? సీఎం దావోస్ పర్యటన వల్ల ఏపికి ప్రయోజనం శూన్యమని కేంద్రం మాటల్లో అర్దమైంది. వైసీపీ క్యాలెండర్ లో ఆగస్టులో ఎంస్.ఈసీలకు పారిశ్రామిక రాయితీలిస్తామన్నారు. కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. కోవిడ్ సమయంలో దేశ వ్యాప్తంగా ఎం.ఎస్.ఈలకు రాయిలీతిచ్చి రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకుంటే ఏపీలో మాత్రం మొండి చేయి చూపారు. రాష్ట్రంలో ఉపాధి, ఉద్యోగాలు లేకనే యువత పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్తున్నారు
వైసీపీ నేతలు చెప్పినట్టు రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు విపరీతంగా వస్తే అడ్డగోలుగా అప్పులు చేయాల్సిన అవసరం ఏంటి? వైసీపీ నేతలు ఇకనైనా అబద్దాలు, తప్పుడు ప్రచారంతో ప్రజల్ని మోసం చేయటం మానుకోవాలి.
addComments
Post a Comment