తెలుగింటి ఆడపడుచులంతా చంద్రబాబుకు చల్లని దీవెనలు అందించండి. *- తెలుగింటి ఆడపడుచులంతా చంద్రబాబుకు చల్లని దీవెనలు అందించండి* 

 *- అక్కచెల్లెమ్మలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు* 

 *- టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్* గుడివాడ, ఆగస్టు 11 (ప్రజా అమరావతి): రాష్ట్రంలోని తెలుగింటి ఆడపడుచులందరూ తమ చల్లని దీవెనలను చంద్రబాబునాయుడుకు అందించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ కోరారు. గురువారం కృష్ణాజిల్లా గుడివాడలో రాఖీ పండుగ సందర్భంగా శిష్ట్లా లోహిత్ తన సందేశాన్ని ఒక ప్రకటన ద్వారా విడుదల చేశారు. రాఖీ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మహిళా సాధికారతే లక్ష్యంగా చంద్రబాబునాయుడు పనిచేస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి మహిళల కోసం ఆర్ధికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, రక్షణపరంగా అండగా నిలవడం జరుగుతోందన్నారు. పూర్వం దేవతలు, రాక్షసులకు మధ్య పుష్కర కాలం పాటు సాగిన యుద్ధంలో దేవతల రాజు దేవేంద్రుడు ఓడిపోయి అమరావతిలో తల దాచుకున్నాడన్నారు. శ్రావణ పౌర్ణమి రోజున పార్వతీ పరమేశ్వరులను, లక్ష్మీ నారాయణులను పూజించి దేవతలందరూ రక్ష లను ఇంద్రుడి చేతికి కట్టి యుద్ధానికి పంపుతారన్నారు. ఆ యుద్ధంలో ఇంద్రుడు గెలిచి తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సంపాదిస్తాడన్నారు. రక్షాబంధనం గురించి అనేక పురాణ కథలు కూడా ప్రచారంలో ఉన్నాయన్నారు. తెలుగింటి ఆడపడుచులంతా ప్రతి ఏటా రాఖీలు కడుతుంటారని, వారందరి చల్లని దీవెనలతో వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు తిరుగులేని విజయం సాధిస్తారని శిష్ట్లా లోహిత్ ఆకాంక్షించారు.

Comments