ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన జడ్జిలుగా ఏడుగురు ప్రమాణ స్వీకారంవిజయవాడ (ప్రజా అమరావతి);*ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన జడ్జిలుగా ఏడుగురు ప్రమాణ స్వీకారం*- *విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నూతన జడ్జీలతో ప్రమాణస్వీకారం చేయించిన గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్*


ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా నూతనంగా ఏడుగురు ప్రమాణ స్వీకారం చేశారు. క్రొత్త జడ్డీలతో రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ ప్రమాణం చేయించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గురువారం ఈ కార్యక్రమం నిర్వహించారు. మొత్తం ఏడుగురు నూతనంగా ప్రమాణం చేయగా,  వారిలో నలుగురు న్యాయమూర్తులుగా, ముగ్గురు అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మొదటగా జస్టిస్‌ అడుసుమల్లి వెంకట రవీంద్రబాబు ప్రమాణం చేశారు. ఆ తర్వాత జస్టిస్‌ డాక్టర్ వక్కలగడ్డ రాధా కృష్ణ కృపా సాగర్, జస్టిస్‌ శ్యాంసుందర్ బండారు, జస్టిస్‌ శ్రీనివాస్‌ వూటుకూరు హైకోర్టు న్యాయమూర్తులుగా ప్రమాణం చేశారు.  అదనపు న్యాయమూర్తులుగా జస్టిస్‌ బొప్పన వరాహ లక్ష్మీ నరసింహ చక్రవర్తి, తల్లాప్రగడ మల్లికార్జున రావు, దుప్పల వెంకట రమణ ప్రమాణస్వీకారం చేశారు. 


ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ వై.లక్ష్మణరావు, జీఏడీ ముఖ్యకార్యదర్శి ఆర్. ముత్యాలరాజు తదితరులు పాల్గొన్నారు.Comments