అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదు

 అలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదు


జిల్లా కలెక్టర్  బసంత కుమార్


పుట్టపర్తి, ఆగస్టు,26 (ప్రజా అమరావతి):  ప్రభుత్వం మనపై ఉంచిన బాధ్యతలను  విస్మరించొద్దు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో వివిధ నిర్మాణ లక్ష్యాల సాధనలోఅలసత్వం వహిస్తే ఉపేక్షించేది లేదు  అని జిల్లా కలెక్టర్  బసంత కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం  కదిరి, పుట్టపర్తి, నియోజకవర్గాలకు సంబంధించిన  పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో

  ప్రాధాన్యత పనులు, రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, హెల్త్ క్లినిక్  తదితర అంశాలపై  ఆయా మండలాల ఎంపీడీవోలు, తాసిల్దార్ లు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ లైబ్రరీ లు, హెల్త్ క్లినిక్ భవన నిర్మాణం పనులు వేగవంతం చేయాలని. ఇవి గ్రామాల స్వరూపాన్ని సమూలంగా మార్చేస్తాయి అని తెలిపారు ఈ పనులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి వేగంగా సకాలంలో పూర్తి చేయాల చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు, రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్స్ భవన నిర్మాణ పనులు అక్టోబర్ 31 నాటికి పూర్తిచేయాలని తెలిపారు.  కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం జరుగుతుందని భరోసా కల్పించాలని అధికారులను ఆదేశించారు. వివిధ పనులకు సంబంధించిన  బిల్లులన్నీ ప్రతి నెల 20 తేదీలోపు అప్లోడ్ చేయాలని. ప్రతి నెల 25వ తేదీ లోపు చెల్లింపులు జరుగుతాయి పేర్కొన్నారు . రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్  జగన్ మోహన్ రెడ్డి. మరియు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పై అంశాలపై ప్రత్యేక సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారని  తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే  పై పనులకు  వివిధ జిల్లాలలో 1100 కోట్లు అందజేయడం జరిగిందని తెలిపారు. మన జిల్లాలో సుమారు 4. కోట్ల బకాయిలు ఉన్నాయని వాటిని త్వరలో చెల్లిస్తామని కాంట్రాక్టర్లకు మీరు భరోసా కల్పించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ శాఖ  సూపర్డెంట్ ఇంజనీర్ గోపాల్ రెడ్డి,  మురళీమోహన్, DE మధుసూదన్, వివిధ మండలాల తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్లు,   అసిస్టెంట్ ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు  తదితరులు పాల్గొన్నారు


 

Comments