రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న* *విద్యా* *అవకాశాలను విద్యార్ధులు* *సద్వినియోగం చేసుకోవాలి



 *జగనన్నవిద్యాదీవెన పథకంలో* *38,236 మంది* *విద్యార్ధులకు ఫీజు రియింబర్స్* *మెంట్ క్రింద రూ.* *26.16 కోట్లు  ఖాతాలకు* *జమ* ..



 *రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న* *విద్యా* *అవకాశాలను విద్యార్ధులు* *సద్వినియోగం చేసుకోవాలి* . 


                                                                *జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న* *వెంకటేష్ వెల్లడి...* 


          ఏలూరు, ఆగష్టు,  11 (ప్రజా అమరావతి):  ఏలూరు జిల్లాలో జగనన్న విద్యాదీవెన పథకంలో  38,236 మంది విద్యార్ధులకు 26.16 కోట్లు రూపాయలు విద్యార్ధుల వారి తల్లులైన 34,079 మంది ఖాతాలకు జమ చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ తెలిపారు.   గురువారం ఉదయం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో జగనన్న విద్యాదీవెన ఏప్రిల్ – జూన్ 2022 విడత ఆర్ధిక సహాయాల పంపిణీ కార్యక్రమం బి.సి. సంక్షేమం ఆధ్వర్యంలో నిర్వహించారు.   ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, మున్సిపల్ కమీషనరు షేక్ షాహిద్, బి.సి. సంక్షేమాధికారిణి నాగమణి, విద్యార్ధులతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి బాపట్లలో పాల్గొన్న రాష్ట్రస్ధాయి జగనన్న విద్యాదీవెన సహాయ పంపిణీ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని తిలకించి ముఖ్యమంత్రి సందేశాన్ని ఆలకించారు.   అనంతరం జగనన్న విద్యాదీవెన పథకం కింద ఏలూరు జిల్లాలో అర్హత కలిగిన 38,236 మంది విద్యార్ధులకు రూ. 26.16 కోట్లు మొత్తానికి నమూనా చెక్కును విద్యార్ధులకు, తల్లులకు కలెక్టర్ అందజేశారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ పేదరికం వలన ఏ తల్లి తన బిడ్డలను చదివించలేని పరిస్ధితి రాకూడదనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన పథకం ద్వారా విద్యార్ధుల చదువులకు ఫీజురియింబర్స్ మెంట్ కింద విద్యార్ధుల తల్లుల ఖాతాలకు జమచేసినట్లు చెప్పారు.  వీటిలో జిల్లాలో ఏలూరు అర్బన్ కు చెందిన 3177 మంది విద్యార్ధుల తల్లులైన 2817 మంది ఖాతాలకు రూ. 2.54 కోట్లు, దెందులూరు నియోజకవర్గానికి చెందిన 6431 మంది విద్యార్ధులకు వారి తల్లులైన 5701 మంది ఖాతాలకు రూ. 4.64 కోట్లు, చింతలపూడి నియోజకవర్గానికి చెందిన 6216 మంది విద్యార్ధులకు వారి తల్లులైన 5559 మంది ఖాతాలకు రూ. 4.15 కోట్లు, గోపాలపురం(ఎస్సీ) నియోజకవర్గానికి  చెందిన 1322 మంది విద్యార్ధులకు వారి తల్లులైన 1193 మంది ఖాతాలకు రూ. 0.90 లక్షలు, కైకలూరు నియోజకవర్గానికి చెందిన 4822 మంది విద్యార్ధులకు వారి తల్లులైన 4272 మంది ఖాతాలకు రూ. 3.23 కోట్లు, నూజివీడు (అర్బన్) నియోజకవర్గానికి చెందిన 6551 మంది విద్యార్ధులకు వారి తల్లులైన 5766 మంది ఖాతాలకు రూ. 4.70 కోట్లు, పోలవరం నియోజకవర్గానికి చెందిన 5016 మంది విద్యార్ధులకు వారి తల్లులైన 4579 మంది ఖాతాలకు రూ. 2.94 కోట్లు, ఉంగుటూరు నియోజకవర్గానికి చెందిన 4701 మంది విద్యార్ధులకు వారి తల్లులైన 4192 మంది ఖాతాలకు రూ. 3.06 కోట్లు జగనన్న విద్యాదీవెన పథకం కింద బాపట్లలోముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి వారి ఖాతాలకు జమచేసినట్లు తెలిపారు.  ప్రభుత్వం కల్పిస్తున్న విద్యా అవకాశాలను విద్యార్ధులు సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉత్తమమైన స్ధితిని పొందాలని కలెక్టర్ తెలిపారు.  

ఈ కార్యక్రమంలో విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు సంబంధిత శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.    


Comments