అమరావతి (ప్రజా అమరావతి);
*జగనన్న తోడు - చిరు వ్యాపారుల ఉపాధికి ఊతం.*
*నిరుపేదలైన చిరు వ్యాపారులు, హస్త కళాకారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారికి ఒక్కొక్కరికి ఏటా రూ.10వేల చొప్పున వడ్డీ లేని రుణం.*
*వరుసగా ఐదోసారి అమలు.*
*కొత్తగా 3.95 లక్షల మందికి ఈ పథకం ద్వారా నేడు అందిస్తున్న రూ.395 కోట్ల రుణం.*
*గత 6 నెలలకు సంబంధించి సకాలంలో రుణాలు చెల్లించినవారికి రూ.15.96 కోట్ల వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ను కూడా కంప్యూటర్‌లో బటన్ నొక్కి విడుదల చేసిన సీఎం శ్రీ వైయస్.జగన్.*
*ఈ సందర్భంగా జిల్లాల నుంచి మాట్లాడిన లబ్ధిదారులు ఏమన్నారంటే...:*
*షేక్ షాజిదా, గుంటూరు జిల్లా.*
*నా పిల్లలను ఇంగ్లీషు మీడియంలో చదవించలేకపోయాను.
*
*అప్పుడు మీరు సీఎంగా లేనందుకు బాధపడుతున్నాను.*
*గతంలో ప్రైవేటు స్కూళ్లలో పిల్లలను చేర్చి మేం ఫీజులు కట్టేవాళ్లం.. మీరేంటన్నా మాకు తిరిగి అమ్మఒడి పేరుతో డబ్బులిస్తున్నారు.*
అన్నా నేను పండ్ల వ్యాపారం చేస్తున్నాను. నా భర్త టైలరింగ్ చేస్తారు.దానిమీద వచ్చే ఆదాయం మా కుటుంబానికి సరిపోవడం లేదు. అందుకనే నేను కూడా ఏదైనా వ్యాపారం చేయాలనుకుని బత్తాయి వ్యాపారం మొదలుపెట్టా. కానీ పెట్టుబడి కోసం మొదట అప్పుతెచ్చుకోవాల్సి వచ్చింది. అది కూడా బయట రూ.2, రూ3 వడ్డీకి తెచ్చుకున్నాను. వచ్చిన ఆదాయం వడ్డీ కట్టడానికే సరిపోయేది. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు జగనన్న తోడు పథకాన్ని తెచ్చారు. దీని గురించి వాలంటీర్ ద్వారా నాకు తెలిసింది. నువ్వు బయట వడ్డీలకు తెచ్చుకుని ఇబ్బంది పడుతున్నావు, జగగన్న ప్రభుత్వం మనకోసం జగనన్న తోడు పధకాన్ని తెచ్చింది.. దానివల్ల నీకు రూ.10వేలు లోన్ వస్తుంది. దానివల్ల నీకు బయట వడ్డీ భారం తగ్గుతుంది. నీకు అఫ్లికేషన్ పెట్టి లోన్ ఇప్పిస్తానని చెప్పింది. రూ.10వేలు లోన్ వచ్చింది. సకాలంలో కట్టుకున్నాను. వడ్డీ భారం తగ్గింది. గతంలో వచ్చిన లాభం వడ్డీకి పోయేది.. ఇప్పుడు ఆ ఇబ్బంది తప్పింది. రెండోసారి కూడా రుణం తీసుకున్నాను. గతంలో లోన్‌ల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగే పరిస్థితి. ఇప్పుడు ఒక రోజు అఫ్లికేషన్ పెట్టుకుంటే.. రెండో రోజే లోన్ వస్తుంది. ఆ ఘనత మీకే దక్కాలి. మీరు పెట్టిన సంక్షేమపథకాలు మా ఇంట్లోనే సగానికి సగం ఉన్నాయి. మా అత్తయ్య బియ్యం వ్యాపారం చేస్తారు. వడ్డీకి తెచ్చి వ్యాపారం చేసేవారు. మీరు 45 సంవత్సరాలకి చేయూత పెట్టడం వలన ఆమెకి చేయూత పథకం వచ్చింది. రూ.18,750 వల్ల బయట అప్పు తెచ్చుకునే భారం తగ్గింది. మా మామయ్యకి పెన్షన్ వస్తుంది. గతంలో గంటల, గంటలు లైన్‌లో నిల్చునేవారు. ఒకటో తేదీన వాలంటీర్ ఇంటికొచ్చి చేతికి పెన్షన్ ఇస్తున్నారు. నాకు ఇద్దరు పిల్లలు. ఒక అమ్మాయి డిగ్రీ చదువుతుంది. ఆమె విషయంలో నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే... ఆమె స్కూల్‌లో చదువుతున్నప్పుడు మీరు సీఎంగా లేరు. పిల్లలకు చదువు ముఖ్యం. ఆమెను ఇంగ్లిషు మీడియంలో చదివించాలని చాలా ఆశపడ్డాను. నా పిల్లలు ఇంగ్లిషులో మాట్లాడాలని కోరిక.అప్పుడు ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిషు మీడియం లేకపోవడంతో అప్పుచేసి ప్రైవేటు స్కూళ్లలో చదివించాను. మీరు వచ్చిన తర్వాత ప్రభుత్వ స్కూళ్లలో నాడు–నేడు, ఇంగ్లిషు మీడియం చేయడంతో ప్రయివేటు స్కూల్‌లో చదువుతున్న నా కొడుకును ప్రభుత్వ స్కూల్‌లో చేర్చాను. ప్రైవేటు స్కూళ్లలో పిల్లలను చేర్చితే మేం ఫీజులు కట్టేవాళ్లం.. మీరేంటన్నా మాకు తిరిగి అమ్మఒడి పేరుతో డబ్బులిస్తున్నారు. మీరు వచ్చిన తర్వాత మహిళలకు చాలా ఆనందంగా ఉంది. మీరు వచ్చిన తర్వాత మహిళలకు గుర్తింపు వచ్చింది. దిశ యాప్ వల్ల ధైర్యంగా బయటకు తిరగగలుగుతున్నాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరానికి రూ.1 లక్ష నేను లబ్ధిపొందుతున్నాను. టిడ్కో ఇళ్లు కూడా వచ్చింది. కోట్లాది మంది మహిళల తరపున నేను చెపుతున్నాను... మీరే ఎప్పుడూ మాకు సీఎంగా ఉండాలి. అల్లా ఊపర్ హై..అచ్చా కరేగా. ధన్యవాదాలు.
*ఎం. మాధవి, పెదపాడు, కర్నూలు.*
*మీలా గతంలో ఎవరూ ఆలోచించలేదు.*
*ప్రభుత్వ పథకాల వల్ల నా కుటుంబం రూ.82 వేల లబ్ధిపొందింది.*
*మా మహిళల తరపున ధన్యవాదాలు అన్నా.*
అన్నా నమస్తే బాగున్నారా అన్నా. నేను ఇంటి దగ్గర కూరగాయల వ్యాపారం చేసేదాన్ని. వడ్డీ వ్యాపారుల దగ్గరికి రూ.10వేల కోసం వెళితే రూ.1000 పట్టుకుని రూ.9000 ఇచ్చేవాడు. మరలా రూ.10,000 కట్టకపోతే మరలా వడ్డీవేసేవాడు. మీరు ప్రవేశపెట్టిన జగనన్న తోడు పథకం కోసం వాలంటీర్ ద్వారా తెలుసుకుని దరఖాస్తు చేశాను. నాకు రుణం వచ్చింది, కూరగాయల బంక్ పెట్టుకుని అమ్ముకుంటున్నాను. నాకు రోజు రూ.500– రూ.800 ఆదాయం వస్తుంది. చాలా సంతోషం. మీ మేలు ఎన్నటికీ మర్చిపోలేను. నా కుమార్తెకు అమ్మఒడి పథకం, నాకు సున్నావడ్డీ వచ్చింది. మా మామయ్యకు రైతుభరోసా వచ్చింది. పంట బీమా వచ్చింది. మీలా గతంలో ఎవరూ ఆలోచించలేదు. నా కుటుంబం రూ.82 వేల లబ్ధిపొందింది. మా మహిళల తరపున ధన్యవాదాలు అన్నా.
*లక్ష్మమ్మ, రామతీర్ధం, నెల్లిమర్ల మండలం, విజయనగరం జిల్లా.*
*గతంలో సంపాదనంతా ప్రయివేటు రుణాల వడ్డీలకే సరిపోయేది.*
*జగనన్న తోడు రుణంతో మా వ్యాపారం పెరిగింది.*
*మళ్లీ, మళ్లీ మీరే సీఎంగా రావాలి.*
మాది చిన్న టిఫిన్ కొట్టు. గతంలో వడ్డీలకు డబ్బులు తెచ్చి నడిపేవాళ్లం. కష్టపడినదంతా వడ్డీలకే సరిపోయేది. మాకు ఏం మిగిలేది కాదు. ఆ టైంలో మీరు జగనన్న తోడు పథకం పెట్టారు. వాలంటీర్ ద్వారా తెలుసుకుని... అఫ్లై చేసి రుణం పొందాము. ఆ డబ్బులతో వ్యాపారం అభివృద్ది చేసుకున్నాం. రెండో విడత కూడా రుణం తీసుకుని వ్యాపారాన్ని పెంచుకున్నాం. మాకు సున్నావడ్డీ, వైయస్సార్ ఆసరా వచ్చింది. మాకు ఇళ్లు లేదు.. ఇప్పుడు మీ దయవలన ఇంటి పట్టా వచ్చింది. ఇల్లు కట్టుకోవడానికి మెటీరియల్ కూడా ఇస్తామన్నారు. అది కూడా వచ్చింది. ఇళ్లు నిర్మించుకున్నందుకు మీకు ధన్యవాదాలు. మా ఆయన చనిపోయారు. నాకు ఇప్పుడు పెన్షన్ కూడా వచ్చింది. మీకు ధన్యవాదాలు. మళ్లీ మళ్లీ మీరే సీఎంగా రావాలి.
addComments
Post a Comment