రైతుల వివరాలు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేయించే విధంగా చర్యలు చేపట్టాలి

 


రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి);పిఎం కిసాన్  యోజన  గడువు ఆగస్టు 31 తో ముగియనున్నందున రైతులకు అవగాహన కల్పించి గ్రామ స్థాయి లో ప్రత్యేక  డ్రైవ్ నిర్వహించి  రైతుల వివరాలు సచివాలయాల్లో  రిజిస్ట్రేషన్ చేయించే విధంగా చర్యలు చేపట్టాల


ని కలక్టర్  డా.కె.మాధవీలత అధికారులను  ఆదేశించారు.


సోమవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయ వీసీ హల్ నుంచి డివిజిన్ మండల స్టాయి అధికారులతో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ సిహెచ్. శ్రీధర్ తో కలసి జగనన్న గృహనిర్మాణలు, గ్రామ, వార్డ్ సచివాలయాలు సేవలు, గడపగడపకు మన ప్రభుత్వం, నాడు..నేడు, జగనన్న స్వచ్ఛ సంకల్పం, స్పందన, ప్రాధాన్యత భవనాలు, క్లాప్, ఓటర్ కార్డుతో ఆధార్ అనుసంధానం డేటా సేకరణ మ్యూటేషన్ వంటి అంశాలపై సమీక్షించారు.


ఈ సందర్భంగా కలెక్టర్ సమీక్షిస్తూ

స్పందనలో వచ్చిన ప్రతి అర్జీ క్షుణ్ణంగా పరిశీలించిన తదుపరి స్పందన వెబ్సైట్ లో నమోదు చెయ్యాలన్నారు. ఏ ఒక్క అర్జీ బియాండ్ ఎస్ ఎల్ ఎస్ కి వెళ్లకూడదని, అదేవిధంగా రీ ఓపెన్ కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పి ఎమ్ కిసాన్ యోజన ద్వారా రైతులకు ఆర్థిక ప్రయోజనం చేకూరే విధంగా రైతుల డేటా ఎంట్రీ పనులు మరింత త్వరగా పూర్తి చెయ్యాలని అన్నారు. ఆగస్ట్ 31 తో నమోదు గడువు పూర్తి కానున్న దృష్ట్యా సచివాలయ సిబ్బంది రెవెన్యూ, వ్యవసాయ కార్యదర్శుల ద్వారా సేకరించిన డేటా ఈరోజు కు ఆరోజే ఎంట్రీ పనులు ఎటువంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా చూసుకోవాలన్నారు. 


జిల్లాలో 24 ఆధార్ సెంటర్లు ఆయా సచివాలయాల్లో ఏర్పాటు చేశామని, ప్రజలు ఆధార్ అనుసంధాన ప్రక్రియ జరిగే విధంగా  ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి సచివాలయం వద్ద ఆధార్ నమోదు పక్రియ పై ప్లెక్షీ లతో కూడిన పబ్లిసిటీ  చేసి ఆధార్ సేవలను అందించాలన్నారు. ఆధార్ అనుసంధానంలో భాగంగా రెండు రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి 5 ఏళ్లు, 15 సంవత్సరాలు నిండిన పాఠశాల విద్యార్థులకు ఆధార్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. దీనిపై ఎంపిడివో, తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.


జిల్లాలో ఓటర్ నమోదు పక్రియ వేగవంతం చెయ్యాలన్నారు. బూత్ లెవెల్ అధికారులు కార్యాచరణతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి 

ఓటర్ ఐ డి కార్డ్ ఆధార్ కు అనుసందాన

నమోదు చేయలన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం లో భాగంగా 115 గ్రామ సచివాలయ పరిధిలో  84,291 ఇళ్లను ప్రజా ప్రతినిధులు సందర్శించారని తెలిపారు.  ఇంకా జిల్లాలో 397 గ్రామ వార్డు సచివాలయాలు మిగిలి ఉన్నాయన్నారు. ప్రజా ప్రతినిదులు పర్యటనలో ఇచ్చిన హామీల కు చెందిన పనులకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. నవ రత్నాలు పేదలందరికీ ఇళ్ళు పథకం ద్వారా జిల్లాలో 48,143 ఇళ్ళ నిర్మాణాలకు మంజూరు ఉత్తర్వులు జారీ చెయ్యగా, ఇప్పటి వరకు 9841 ఇళ్ళు పూర్తి చేశారన్నారు.  కనీసం వారం వారం మూడు అంకెల ప్రగతి స్టేజ్ కన్వర్షన్ లో చూపాలని ఆదేశాలు ఇచ్చామన్నారు.  పని భారం పడకుండా 

ప్రతి ఎంపిడివో కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి రోజువారీ సచివాలయలు ద్వారా చేస్తున్న ప్రభుత్వ సేవలు పై సమీక్షలు నిర్వహించాలని ఎంపిడిఓలకు సూచించారు. మండల స్థాయి లో పనుల పురోగతిపై  డివిజనల్ అభివృద్ధి అధికారులు, జిల్లా గ్రామ వార్డు సచివాలయ పర్యవేక్షణ అధికారి కోరే ప్రగతి విషయం పై సానుకూల స్పందన ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. జిల్లాలో 522 గ్రామ వార్డు సచివాలయ పరిధిలో వొచ్చిన సేవ ధరఖాస్తుల్లో కొవ్వూరు డివిజన్ లో 10,761 లో 54.62 శాతం, రాజమండ్రి డివిజన్ లో 14,170 లో44.98 శాతం మేర సేవలు అందించగలిగారని కలెక్టర్ తెలియచేశారు. సచివాలయ , వాలంటీర్ వ్యవస్థ ద్వారా త్వరితగిన సేవలు అందించే సామర్థ్యం పెంచుకోవాలని, అదే ముఖ్యమంత్రి వర్యుల ఆలోచనగా కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో అర్భికే, సచివాలయం, వెల్ నెస్ సెంటర్ ల  1101 ప్రాధాన్యత భవన నిర్మాణ పనుల్లో 616 పూర్తి అయ్యాయని, ఇంకా ప్రారంభం కానీ వాటికి సంబంధించి భూసమస్య పరిష్కారం కోసం మరింతగా దృష్టి పెట్టామని ఆదేశించారు. 


వీడియో కాన్ఫెరెస్ లో ఆర్డీఓ  ఏ. చైత్ర వర్షిణి, జిల్లా హౌసింగ్ అధికారి టి.తారా సింగ్,   డిఎస్ఓ ప్రసాదరావు,   డీఈవో ఎస్. అబ్రహం, సీపీవో ప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ  డి. బాలశంకరరావు, డ్వామా పీడీ జీ ఎస్ . రామ్ గోపాల్, తదితరులు పాల్గొన్నారు.Comments