రామచంద్రపురంలో ఘనంగా ఆజాదీకా అమృత్ మహోత్సవం-పాల్గొన్న మంత్రి వేణుగోపాల కృష్ణ

 రామచంద్రపురంలో ఘనంగా ఆజాదీకా అమృత్ మహోత్సవం-పాల్గొన్న మంత్రి వేణుగోపాల కృష్ణ


రామచంద్రపురం, ఆగస్టు 11 (ప్రజా అమరావతి): రామచంద్రపురం పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గురువారం అజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సంక్షేమ, సమాచార మరియు సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి శ్రీ చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ పాల్గొన్నారు. 

మంత్రి వేణు చేతి నిండా రాఖీలే.. ఘనంగా రక్షా బంధన్ వేడుకలు...

రామచంద్రపురం లో మంత్రి వేణు చేతి నిండా రాఖిలతో నిండిపోయాయి.ఉదయం నుండి స్థానిక మహిళా ప్రజా ప్రతినిధులు,ఇతర మహిళా నేతలు,సచివాలయం మహిళ ఉద్యోగినీలు,మహిళా వాలెంటీర్లు,స్థానిక పాఠశాల విధ్యార్థినిలు మంత్రి వేణుకి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలియచేసి రాఖిలను కట్టారు.     

రామచంద్రపురంలో 350 అడుగుల భారీ జాతీయ పతాక ప్రదర్శన

రామచంద్రపురం పురవీధుల్లో 350 అడుగుల భారీ జాతీయ పతాకంతో నిర్వహించిన ర్యాలీ ప్రత్యేక ఆకర్షణ నిలిచింది.వియస్ఎం కాలేజీ నుండి రాజగోపాల్ సెంటర్ వరకు విద్యార్ధులు,మహిళలు,స్థానిక ప్రజా ప్రతినిధుల తో మంత్రి వేణు భారీర్యాలీనీ నిర్వహించారు. 

రామచంద్రపురం లోని స్థానిక పాఠశాల విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ.. ఎన్‌సీపీ యూనిట్‌ విద్యార్థులతో జాతీయ జెండా నినాదాలతో హోరెత్తించారు. పాఠశాల విద్యార్థులు జాతీయ నాయకుల వేషధారణతో  ప్రత్యేకాకర్షణగా నిలిచారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ స్వాతంత్య్రం సిద్ధించి 75 వసంతాలను పూర్తి చేసుకుంటున్న ప్రస్తుత శుభ తరుణంలో ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలని ప్రజలకు పిలుపు నిచ్చారు.గడిచిన 75 సంవత్సరాల కాలంలో మనదేశం ఎంతో పురోగతిని సాధించిందని అన్నారు.భారత కీర్తి పతాకా దశ దిశలా వ్యాప్తి చెందేలా అగస్టు 8 నుంచి 15 రోజుల పాటు వజ్రోత్సవాలను కుల,మతాలకు అతీతంగా పండుగ వాతావరణంలో జరుపుకోవాలని పిలుపునిచ్చారు.ఆనాడు స్వాతంత్ర్య పోరాట యోధులు కలలుగన్న సమాజాన్ని ఈనాడు మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మనకి అందించారని తెలిపారు. అంతేగాక మహాత్మా గాంధీ,డా.బి అర్ అంబేడ్కర్ మహాత్మా ఫూలే వంటి మహాత్ముల ఆశయాల సాధన కోసం పోరాడుతున్నాడన్నారు.పేదవాడి నుండి  పేదరికమనే రోగాన్ని తీసివేయాలని నవరత్నాలతో సంక్షేమాన్ని ప్రతీ గడపకు అందిస్తున్నాడన్నారు.

ఆడబిడ్డ  అర్థరాత్రి స్వేచ్చగా నడియాడిన రోజు దేశానికి నిజమైన స్వాతంత్ర్యం అని ఆనాడు గాంధీ మహాత్ముడు చెప్పిన మాటలు గుర్తుకొస్తున్నాయని మంత్రి శ్రీనివాస వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు. రామచంద్రపురంలో వేల మంది నా ఆడపడుచులు రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని ఇక్కడ ఉండటం చాలా సంతోషం గా ఉందని తెలిపారు.రామచంద్రపురం మహిళా స్వాతంత్య్రం,మహిళా స్వేచ్ఛ,మహిళా రక్షణకు, మహిళల అభ్యున్నతికి లోటు లేదని వేలాదిగా తరలి వచ్చి జాతీయ భావాన్ని కల్గించడం చాలా సంతోషగా వుందని మంత్రి వేణుగోపాల కృష్ణ పేర్కొన్నారు.

Comments