రైతుల సంక్షేమానికి, వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది.

 

నెల్లూరు (ప్రజా అమరావతి);



రైతుల సంక్షేమానికి,  వ్యవసాయ రంగానికి  రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నద


ని రాష్ట్ర వ్యవసాయం,సహకారం,  మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్  శాఖామాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

 

బుధవారం ఉదయం వెంకటాచలం మండలం, చెముడుగుంట జడ్.పి హై స్కూల్ ఆవరణలో జరిగిన మెగా మేళా కార్యక్రమంలో  రాష్ట్ర వ్యవసాయం,  సహకారం,మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్  శాఖామాత్యులు శ్రీ కాకాణి గోవర్ధన, జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబుతో కలసి  వై.ఎస్.ఆర్ యంత్ర సేవా పధకం క్రింద సి.హెచ్.సి గ్రూపు  లబ్ధిదారులకు  ట్రాక్టర్స్ ను , వరి కోత యంత్రాలను పంపిణీ చేశారు.

 

ఈ సంధర్భంగా మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, ఈ రోజు జిల్లాలో  వై.ఎస్.ఆర్ యంత్ర సేవా పధకం క్రింద 339 గ్రూపులకు 34.80 కోట్ల రూపాయల విలువ గల 223 ట్రాక్టర్లను, 33 వరి కోత యంత్రాలను 11.80 కోట్ల సబ్సిడీ తో అందచేస్తున్నట్లు తెలిపారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ రైతులకు మరింతగా ఆర్ధిక తోడ్పాటు అందించాలన్న లక్ష్యంతో  ఒకే విడతలో 4 వేల ట్రాక్టర్స్ ను మంజూరు చేయడం జరిగిందన్నారు. రైతులను, అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రతి జిల్లా కేంద్రంలో ఈ ట్రాక్టర్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని మంత్రి తెలిపారు.  రైతులు కోరుకున్న మోడల్, కోరుకున్న ఏజెన్సీ లో సబ్సిడీ పై లబ్ధిదారులకు ట్రాక్టర్స్ ను, వరి కోత యంత్రాలను పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అండగావుంటూ వారికి సుస్థిరమైన ఆదాయం లభించేలా రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నదన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించి రైతు నష్టపోయినప్పుడు ఆ సీజన్లోనే రైతులు సబ్సిడీ పై విత్తనాలు, పంట నష్ట పరిహారాన్ని ఇవ్వడం జరుగుచున్నదని మంత్రి తెలిపారు.  అలాగే రైతు పై ఆర్ధిక భారం పడకుండా రైతుల్లో అవగాహన కల్పించి పంట భీమాకు సంబంధించిన ప్రీమియంను ప్రభుత్వమే చెల్లిస్తున్నట్లు మంత్రి తెలిపారు. వ్యవసాయ పెట్టుబడి కింద రైతు భరోసా పధకం  కింద ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ది,  సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ పారదర్శకంగా అవి అమలు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు.  పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకోవడం జరుగుచున్నదని,  రానున్న సీజన్లో ధాన్యం కొనుగోలుపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు  మంత్రి శ్రీ గోవర్ధన్ రెడ్డి తెలిపారు.

 

జిల్లా కలెక్టర్ శ్రీ  కె.వి.ఎన్ చక్రధర్ బాబు మాట్లాడుతూ, ప్రతి సీజన్ లో రైతులకు అండగా వుంటూ  రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. జిల్లాలో సోమశిల, కండలేరు జలాశయాల వలన సాగునీటి లభ్యత పెరగడంతో, సాగు విస్తీర్ణం పెరిగిందని,  దానికనుగుణంగా  పూర్తి స్థాయిలో రైతూలకు అవసరమైన విత్తనాలు,ఎరువులు,పురుగు మందులు, వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లును సబ్సిడీ పై  అందచేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.  జిల్లా లో 60 శాతం మంది ప్రజలు వ్యవసాయ మరియు దాని అనుబంధ  రంగాలపై ఆధారపడి జీవిస్తున్నారని, వీరి సమస్యలను  ఎప్పటికప్పుడు పరిష్కరించేలా  ప్రతి నెలా ఆర్.బి.కె స్థాయి నుండి మండల, జిల్లా స్థాయిలో  వ్యవసాయ సలహా మండలి సమావేశాలు నిర్వహిస్తూ  సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు  కలెక్టర్  తెలిపారు.  రానున్న సంవత్సరాల్లో  సాంకేతికంగా వస్తున్న నూతన వ్యవసాయ విధానాలపై,  ప్రకృతి వ్యవసాయంపై  రైతులను మరింతగా ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు శ్రీ  నిరంజన్ బాబు రెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్. కూర్మనాథ్,  రాష్ట్ర రైతు సాధికార సంస్థ   స్టేట్ కో ఆర్డినేటర్ శ్రీ కర్నాటి ప్రభాకర్ రెడ్డి , జిల్లా వ్యవసాయ శాఖాధికారి శ్రీ సుధాకర్ రాజు, వెంకటాచలం జడ్.పి.టి.సి శ్రీ సుబ్రమణ్యం, ఏం.పి.పి శ్రీమతి కవిత, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Comments