వేల సంఖ్యలో భక్తులు ఆ వైకుంఠవాసుడిని తనివితీరా దర్శించుకోవడం జిల్లా ప్రజల అదృష్టoనెల్లూరు, ఆగస్టు 19 (ప్రజా అమరావతి): శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు నెల్లూరులో కన్నుల పండువగా జరగడం, వేల సంఖ్యలో భక్తులు ఆ వైకుంఠవాసుడిని తనివితీరా దర్శించుకోవడం జిల్లా ప్రజల అదృష్ట


భాగ్యమని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. 


 తిరుమల తిరుపతి దేవస్థానం, విపిఆర్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో  నెల్లూరు నగరంలోని  ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో  అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాల్లో భాగంగా  శుక్రవారం ఉదయం స్వామి వారికి నిర్వహించిన అభిషేక కార్యక్రమంలో మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి  దంపతులు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఆ దేవదేవుని దర్శన భాగ్యాన్ని జిల్లా ప్రజలకు కల్పించాలనే గొప్ప సంకల్పంతో టీటీడీ చైర్మన్ శ్రీ వై వి సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ధర్మారెడ్డి సంపూర్ణ సహకారం తో, రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఈ వైభవోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయన్నారు. జిల్లా ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని స్వామి వారిని దర్శించుకోవాలని కోరారు.

ఈ పూజా కార్యక్రమాల్లో ఆత్మకూరు శాసనసభ్యులు శ్రీ మేకపాటి విక్రమ్ రెడ్డి, మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, వెంకటగిరి మాజీ ఎమ్మెల్యే శ్రీ సాయికృష్ణ యాచేంద్ర తదితర ప్రముఖులు పాల్గొన్నారు.


Comments