*అక్టోబరు 15 న హైకోర్టు నిరుపయోగ వాహనాలు వేలం*
అమరావతి, సెప్టెంబరు 28 (ప్రజా అమరావతి): ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో నిరుపయోగంగా వున్న మహేంద్ర బొలెరో వాహనం మరియు ఐదు మారుతి ఓమ్ని వ్యాన్ లను అక్టోబరు 15 వ తేదీ శనివారం ఉదయం 11.30 గంటలకు హైకోర్టు ఆవరణలో యధాస్థితిలో వేలం వేయడం జరుగుతుందని ప్రొటోకాల్ ఓ.ఎస్.డి. యం.గురునాధ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ముందుగా గురుమూర్తి వారి అనుమతి పొంది ఈ నెల 30 నుండి అక్టోబరు 1 వ తేదీలలో సాయంత్రం 4.00 గంటల నుండి 5.00 గంటల మద్య పరిశీలించుకొని వేలంలో పాల్గొనవచ్చునని ఆయన తెలిపారు.
addComments
Post a Comment