16న మెగా జాబ్ మేళా
పార్వతీపురం, సెప్టెంబర్ 12 (ప్రజా అమరావతి): పార్వతీపురం మన్యం జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించుటకు జిల్లా యంత్రాంగం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 16వ తేదీన మెగా జాబ్ మేళాను శ్రీ వేంకటేశ్వర ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్నారు. మెగా జాబ్ మేళా పోస్టర్ ను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమ వారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విడుదల చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళను ఏర్పాటు చేశారు. జాబ్ మేళలో సినర్జీస్ కాస్టింగ్ లిమిటెడ్, అపోలో ఫార్మసీ, సినాప్టిక్ లాబ్స్, హెచ్.డి.ఎఫ్.సి, ఎస్.బి.ఐ కార్డ్స్ (టీమ్ లీజ్), బ్యాంక్ ఆఫ్ బరోడా (ఇన్నోవ సోర్స్), అవంటెల్ లిమిటెడ్, ఓసిమమ్ లాబ్స్, శ్రీరంగ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, హెటిరో, ఎస్.టి.ఎస్.వెల్త్ మేనేజిమెంట్, రస పూర్ణ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, బాల్ బెవరేజ్ పేకింగ్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ అనే 13 కంపెనీలు ఇందులో పాల్గొంటున్నాయని ఆయన చెప్పారు. 775 ఉద్యోగాల భర్తికి ఇంటర్వ్యూ లను నిర్వహిస్తున్నారని ఆయన వివరించారు. కంపెనీలు ట్రైనీ ఉద్యోగాల నుండి ఫార్మసిస్ట్, ఎక్జిక్యూటివ్, రిలేషన్ ఎక్జిక్యూటివ్, బ్రాంచ్ రిలేషన్ షిప్ మేనేజర్, సేల్స్ ఎక్జిక్యూటివ్, ప్రొడక్షన్ తదితర ఉద్యోగాలలో నియామకాలు చేపట్టనున్నాయన్నారు. రూ.10 నుండి 25 వేల వరకు వేతనాలు లభించే ఉద్యోగాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. 18 నుండి 30 సంవత్సరాల వయస్సు గల పురుషులు, మహిళలు మేళాకు అర్హులని చెప్పారు. 10వ తరగతి, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, బి.టెక్ వారి విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు ఇందుకు అర్హులని ఆయన అన్నారు. ఉద్యోగాలు విశాఖపట్నం, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో నిర్వహించాలని ఆయన సూచించారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు www.apssdc.gov.in వెబ్ సైట్ లో పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. వివరాలకు 6305110947, 9700569561, 8555909899, 9703696328 ఫోన్ నంబర్లకు సంప్రదించాలని సూచించారు. ఈ అవకాశాన్ని మన్యం జిల్లా నిరుద్యోగ యువతీ యువకులు సద్వివినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్, సబ్ కలెక్టర్ భావన, జిల్లా రెవెన్యూ అధికారి జే. వెంకట్రావు, జిల్లా నైపుణ్య అభివృద్ది అధికారి యు.సాయి కుమార్, ప్లేస్ మెంట్ ఎక్జిక్యూటివ్ ఎన్.మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment