రాజమహేంద్రవరం (ప్రజా అమరావతి):
సోమవారం స్పందన సందర్భంగా ఈరోజు 22 ఫిర్యాదులు ప్రజల నుంచి రావడం జరిగింద
ని మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ పేర్కొన్నారు.
స్థానిక మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏ డి సి పి ఎం సత్య వేణి, ఎస్సీ జి పాండురంగారావు, ఇతర అధికారులు, సచివాలయ సిబ్బంది తో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.అనంతరం స్పందన ఫిర్యాదులపై సచివాలయ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు.
కమిషనర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ,
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు పరిష్కారానికి అనువుగా ఉన్నా , లేకున్నా వాటిని నిర్ధారించి ఆ విషయం తెలియ చేయాల్సిన బాధ్యత సచివాలయ సిబ్బందిపై ఉందన్నారు. స్పందన ద్వారా గానీ, మున్సిపల్ కమిషనర్ వొచ్చే ప్రతి ఒక్కటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ఆదేశించారు. స్పందన ఫిర్యాదు వొచ్చింది పరిష్కారం చూపామని కాకుండా, మనస్సు పెట్టి వాటి పరిష్కారం కోసం పనిచేయాలన్నారు. ఏదైనా ఒక ఫిర్యాదు తిరిగి ఓపెన్ అయితే శానిటేషన్, తదితర పరిష్కారం చేసేవి అయితే సంబంధించిన అధికారిదే బాధ్యత అన్నారు. ఆయా విభాగాల ఉన్నతాధికారుల స్థాయి కి చెందిన వాటికి అనుగుణంగా పరిష్కారం కోసం బాధ్యత తీసుకోవాలన్నారు. వార్డు సచివాలయ కార్యదర్శుల, వాలంటీర్ ల బయో మెట్రిక్ హాజరు లో ఎటువంటి మినహాయింపు లేదని కమిషనర్ స్పష్టం చేశారు.
పౌర సేవలు అందించే క్రమంలో పనితీరులో ప్రగతి సాధించాక పోవడం పై కమిషనర్ దినేష్ కుమార్ వివరణ కోరారు. ప్రధాన కార్యదర్శి కనీసం 50 సేవలు అందించాల్సి ఉండగా వి ఎల్ పురం లో 20, మిగిలిన వారు 15 లోపు సేవలు అందించడం జరుగుతోందని కమిషనర్ దినేష్ కుమార్ తెలిపారు. పనీ తీరు మరింత మెరుగు పరుచు కోవాలన్నారు. అదేవిధంగా సచివాలయ వ్యవస్థ ద్వారా మెరుగైన పౌర సేవలు అందించే సామర్థ్యం పెంచుకోవాలని పలు మార్లు సూచించడం జరిగిందని, అయినా కొన్ని వార్డు సచివాలయాల్లో తెలిపారు. వార్డు కార్యదర్సులకు సంబంధించి వెల్ఫేర్, హెల్త్, శానిటేషన్, తదితర సిబ్బంది వారి విధుల పట్ల అత్యంత అప్రమత్తత అవసరం అని దినేష్ కుమార్ పేర్కొన్నారు. విద్యకు ప్రభుత్వం అత్యంత ప్రాధన్యతను ఇస్తున్న దృష్ట్యా స్కూల్స్ లో చేపట్టవలసిన పనులు, తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
addComments
Post a Comment