30 ఐఐటీ సీట్లను సాధించిన ఎస్సీ గురుకుల విద్యార్థులు
- మంత్రి మేరుగు నాగార్జున వెల్లడి.
అమరావతి, సెప్టెంబర్ 11 (ప్రజా అమరావతి): జెఇఇ అడ్వాన్స్ పరీక్షలలో ఎస్సీ గురుకులాలకు చెందిన విద్యార్థులు ప్రతిభను కనబరిచి 30 ఐఐటీ సీట్లను సాధించారని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. రాష్ట్రంలో చిన్న టేకూరు, ఈడ్పుగల్లు, అడవి తక్కెళ్లపాడు లో ఉన్న మూడు జెఇఇ శిక్షణా కేంద్రాల నుంచి మొత్తం 72 మంది విద్యార్థులు జెఇఇ అడ్వాన్స్ పరీక్షలు రాయగా వారిలో 37 మంది అర్హత సాధించారని ఆదివారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. జెఇఇ అడ్వాన్స్ పరీక్షలలో అర్హత సాధించిన వారిలో చిన్నటేకూరు కేంద్రం నుంచి 15 మంది, అడవి తక్కెళ్లపాడు కేంద్రం నుంచి 10 మంది, ఈడ్పుగల్లు కేంద్రం నుంచి 5 మంది ఐఐటీ సీట్లను సాధించారని చెప్పారు. మిగిలిన విద్యార్థులకు కూడా వారు జెఇఇ అడ్వాన్స్ పరీక్షలలో సాధించిన మార్కుల ప్రకారంగా ఎన్ఐటీతో సహా ఇతర కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలలో సీట్లు వస్తాయని వివరించారు. ఐఐటీలో సీట్లు సాధించిన విద్యార్థులను ఈ సందర్భంగా నాగార్జున అభినందించారు.
addComments
Post a Comment