ఈరోజు మెగా జాబ్ మేళా లో 400 మందికి ఉద్యోగ అవకాశాలు

 


 నల్లజర్ల, (ప్రజా అమరావతి);


ఈరోజు మెగా జాబ్ మేళా లో 400 మందికి ఉద్యోగ అవకాశాలుప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి


సెప్టెంబర్ 14 న సిఎం చే నైపుణ్యాభివృద్ధి కార్యక్రమం


- జిల్లా కలెక్టర్ మాధవీలత రాష్ట్ర ప్రభుత్వం విద్యకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతోందని, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని వాటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టరు డా. కె. మాధవీలత పేర్కొన్నారు.


శుక్రవారం నల్లజర్ల ఏకేఆర్ జి ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో గోపాలపురం నియోజకవర్గం పరిధిలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు స్థానిక శాసనసభ్యులు తలారి వెంకట్రావుతో కలసి కలెక్టరు పాల్గొన్నారు.  వికాస్ మేనేజరు లచ్చారావు అధ్వర్యంలో25 కంపెనీలు విద్యార్థులకు ఇంటర్వూలు నిర్వహించారు.  ఈ సందర్బంగా కలెక్టరు మాట్లాడుతూ జిల్లాలో వికాస్ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలను నిర్వహించి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించడం  జరుగుతుందన్నారు.  ఆ దిశలో భాగంగా నేడు నల్లజర్ల జాబ్ మేళాను నిర్వహించామని ఈ జాబ్ మేళా ద్వారా వచ్చే ఉద్యోగ అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. ముఖ్యంగా తల్లితండ్రులు వారి పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని  వారు  ఉద్యోగాల్లో చేరేలా ప్రోత్సహించాలన్నారు. ఇది తొలి అడుగని ఎక్కడ ఉద్యోగం వచ్చినా పిల్లలను పంపి వారి ఉన్నతికి చేయూత  నిచ్చే దిశలో వారు అభివృద్ది  చేందేందుకు ఎక్కడికైనా పంపించేందుకు వెనుకాడరాదని కలెక్టరు అన్నారు. వికాస్ ద్వారా ఉద్యోగాలు వచ్చిన వారిని నిరంతరం పర్యవేక్షించడం జరుగుతుందన్నారు.  ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి విద్యతో పాటు ఉద్యోగంలో స్థిరపడేలే స్వయం ఉపాధి సాదించే విధంగా నైపుణ్యాభివృద్ది కార్యక్రమాలను కూడా ఇంటర్ షిప్ కార్యక్రమాలను అమలు చేస్తుందన్నారు. సెప్టెంబరు 14 వ తేదీన ముఖ్యమంత్రి చేతుల మీదుగా నైపుణ్యాభివృద్ది కార్యక్రమాలకు  ఆయా కంపెనీలతో సంప్రదించి వారికి అవసరమైన శిక్షణను ఇవ్వడం జరుగుతుందన్నారు.  ముఖ్యంగా బాలికలు పదవ తరగతి తరువాత చదువును కొనసాగించాలనే సంకల్పంతో జిల్లాలో 19  ఉన్నత పాఠశాలల్లో రెండు సంవత్సరాల ఇంటర్ విద్యను ఈ ఏడాది నుంచి అందుబాటులోనికి తెచ్చామన్నారు. ఎక్కడా డ్రాప్ అవుట్స్ ఉండరాదనే లక్ష్యంతో అమ్మఒడి, జగనన్న వసతి దీవెన, విద్యాదీవెన, విద్యా కానుక వంటి కార్యక్రమాలతో పాటు నాడు- నేడు ద్వారా పాఠశాలలను అభివృద్ది చేస్తున్నామన్నారు. విద్యకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కలెక్టరు కోరారు. ఈరోజు జాబ్ మేళా లో సుమారు 1200 మంది హాజరుకాగా, వారిలో 400 మందికి 25 కంపెనీల్లో ఉద్యోగాలను ఇవ్వడం జరిగిందన్నారు. వికాస్ బృందాన్ని కలెక్టర్ అభినందించారు శాసనసభ్యులు  తలారి  వెంకట్రావు మాట్లాడుతూ  రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేస్తుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర రెడ్డి ఆనాడు వ్యవసాయం, వైద్య ఆరోగ్య రంగంతో పాటు విద్యకు అత్యంత ప్రాధాన్యతను కల్పించారన్నారు. అర్హత గల వారందరికీ పీజు రియంబర్స్ మెంట్  అందించడంతో  నిరుపేదయినా అనేకమంది ఇంజనీరింగ్, మెడిసిన్ విద్యను అభ్యశించి నేడు వున్నత స్థానల్లో ఉన్నారన్నారు.  నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి నాడు - నేడు ద్వారా పాఠశాలలను ఆదునీకరిస్తూ మౌలిక సదుపాయలు కల్పిస్తున్నారన్నారు. నేటి ప్రపంచీకరణలో ప్రతి విద్యార్థి పోటీని తట్టుకొని వారి ప్రతిభను నిరూపించుకొనే విధంగా పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టారన్నారు. అదేవిదం గా పాఠశాల విద్య అయినా విద్యార్థులు వేరేచోటకు వెళ్లాల్సిన అవసరం  లేకుండా అదే పాఠశాలలో ఇంటర్ విద్యను అందించేందుకు జూనియర్ కళాశాలను ఏర్పాటు చేశారన్నారు. నల్లజర్ల నియోజకవర్గలో నాలుగు జూనియర్ కళాశాలలు  వచ్చాయని తెలిపారు. యువతకు  ఉపాధి అవకాశలు కల్పించే దిశగా నేడు వికాస్ ఆధ్వర్యంలోజాబ్ మేళా  నిర్వహించడం  ఎంతోషంగా ఉండన్నారు.


కార్యక్రమంలో వికాస్ కేంద్రం నిర్వాహుకులు లచ్చారావు, నల్లజర్ల, ద్వారకాతిరుమల, దేవరపల్లి, గోపాలపురం మండలాల స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.Comments