మూడేళ్లలో వ్యవసాయం కోసం కోసం రూ.83 వేల కోట్లు రాష్ట్రప్రభుత్వం ఖర్చు చేసింది

 *మూడేళ్లలో వ్యవసాయం కోసం కోసం రూ.83 వేల కోట్లు రాష్ట్రప్రభుత్వం ఖర్చు చేసింది*



*రైతులు - అధికారుల మధ్య కుటుంబ సంబంధం ఉండాలి*


*రాష్ట్ర అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవిఎస్.నాగిరెడ్డి*



కర్నూలు, సెప్టెంబర్ 09 (ప్రజా అమరావతి):  మూడేళ్లలో వ్యవసాయం కోసం రూ.83 వేల కోట్లు రాష్ట్ర  ప్రభుత్వం ఖర్చు చేసిందని, ఏ రాష్ట్రం లో జరుగనన్ని కార్యక్రమాలు వ్యవసాయానికి చేస్తున్నామని రాష్ట్ర అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవిఎస్.నాగిరెడ్డి పేర్కొన్నారు.


శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన  వ్యవసాయ మరియు అనుబంధ రంగాల భాగస్వామ్య పక్షాలతో ముఖాముఖి చర్చ లో  రాష్ట్ర అగ్రికల్చర్ మిషన్   వైస్ చైర్మన్   ఎంవిఎస్ నాగిరెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.. ఈ కార్యక్రమంలో  జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు,పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే డా.సుధాకర్,కర్నూలు, నంద్యాల జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ లు బెల్లం మహేశ్వర రెడ్డి, భరత్ కుమార్ రెడ్డి, కేడిసిసి బ్యాంక్ చైర్మన్ మహాలక్ష్మి,రాష్ట్ర అగ్రికల్చర్ మిషన్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ చంద్ర శేఖర్ రెడ్డి, అధికారులు, రైతులు పాల్గొన్నారు .


ఈ సందర్భంగా అగ్రికల్చర్ మిషన్   వైస్ చైర్మన్   రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ప్రతి జిల్లాకు వెళ్లి ఇలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ఇది 13 వ జిల్లా అని పేర్కొన్నారు..వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి ఏ  సమస్య ఉన్నా తమకు తెలియ చేస్తే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా రైతులు అవసరమైన జ్ఞానాన్ని పెంచుకోవాలన్నారు.


ఏ రాష్ట్రంలో లేని విధంగా పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలను మన రాష్ట్రంలో అమలు చేయడం జరుగుతోందన్నారు.విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి మీద  రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు .వచ్చిన ప్రతి రూపాయను పేదల కోసం ఖర్చు చేస్తోందన్నారు.. .పెట్టుబడి సాయంగా రైతు భరోసా పథకం కింద రూ .13500 అందిస్తోన్దన్నారు..వ్యవసాయానికి 9 గంటలు ఉచిత కరెంట్ ఇస్తూ,  35 వేల కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్ కొరకు ఖర్చు చేయడం జరిగిందన్నారు.. క్రమేణా కరువు తగ్గుతోందని, గత మూడు సంవత్సరాల్లో ఒక కరువు మండలం కూడ లేదని పేర్కొన్నారు.  


కర్నూలు జిల్లాలో 20.89 శాతం పేదరికం ఉందని, అందుకే ఈ జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు..రైతులు - అధికారుల మధ్య కుటుంబ సంబంధం ఉండాలన్నారు..రైతుకు సేవ చేసే అవకాశాన్ని అధికారులు వినియోగించుకోవాలన్నారు..పండ్ల తోటల  సాగు వైపుకు రైతులు దృష్టి సారించేలా చర్యలు తీసుకోవాలన్నారు .రైతుకు లాభసాటిగా ఉండేలా పంటలు సాగు చేసేలా అధికారులు, వ్యవసాయ సలహా మండలి సభ్యులు ప్రోత్సహించాలన్నారు . పాడి పరిశ్రమ అభివృద్ధి దిశగా అడుగులు వేయాలన్నారు..పశువులు రోగాల బారిన పడితే, వెంటనే చికిత్స అందించేలా వెటర్నరీ అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలన్నారు . జిల్లాలో అనువుగా ఉన్న ప్రాంతాల్లో సె రికల్చర్, వెదురు సాగును ప్రోత్సహించాలని సూచించారు..గ్రామాల్లో ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల గురించి పక్క రాష్ట్రాల వారు కూడా మాట్లాడడం జరుగుతోందని, ఇతర రాష్ట్రాల వారు ఇక్కడికి వచ్చి ఆర్బికెలను పరిశీలిస్తున్నారన్నారు. రైతు భరోసా కేంద్రాలను మరింత బాగా నిర్వహించాలని, వాటి పరిధిలో రైతులకు మేలు చేసే పొలంబడి, తోట బడి  కార్యక్రమాలను మంచి ఫలితాలు అందించేలా కొనసాగించాలన్నారు. 


వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించడం పై రైతులకు ఉన్న అపోహలను తొలగించాలన్నారు.. మీటర్లు బిగించడం వల్ల రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగవని ఆయన తెలిపారు..రైతులు ఈ క్రాప్ రిజిస్ట్రేషన్, ఈ కేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలని, ఇందులో ఎలాంటి నిర్లక్ష్యం వద్దని, దీని ద్వారా రైతులకు పలు విధాలా లబ్ధి కలుగుతుందన్నారు. వ్యవసాయంలో అనుభవజ్ఞులైన రైతులు ఇతర రైతులకు సలహాలు, సూచనలు అందించాలన్నారు. రైతులకు మేలు చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.


జిల్లా కలెక్టర్ పి కోటేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్ర వ్యవసాయ మిషన్ ద్వారా రైతులకు సూచనలు, సలహాలు అందజేయడం జరుగుతుందన్నారు.. జిల్లాలో 446 రైతు భరోసా కేంద్రాలు మంజూరు కాగా, ఇప్పటివరకు  రెండు కేంద్రాలు తప్ప 444 ఆర్బీకే భవన నిర్మాణాలు మొదలయ్యాయని,  గురువారం నాటికి 94 భవనాలు కంప్లీట్ అయ్యాయని కలెక్టర్ తెలిపారు.. అక్టోబర్ 31 నాటికి అన్ని భవన నిర్మాణాలను పూర్తి చేసి రైతులకు అందుబాటులోకి తెస్తామన్నారు. అలాగే 240 మల్టీపర్పస్ గోడౌన్ నిర్మాణాలు కూడా మొదలయ్యాయని కలెక్టర్ తెలిపారు..


పాణ్యం ఎమ్మెల్యే రామ్ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయంలో పురుగుమందులు, రసాయనిక ఎరువులు తగ్గించే విధంగా ప్రజలను చైతన్యవంతులను చేయాలని అధికారులు వ్యవసాయ సలహా మండలి సభ్యులను కోరారు.. రసాయనిక ఎరుపులు వేస్తేనే పంటలు బాగా పండుతాయనే అపోహ నుంచి రైతులను తొలగించాలన్నారు క్రమేపి రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లెలా ప్రోత్సహించాలన్నారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా లాభాలు వస్తాయని, ఈ విషయాన్ని తాను  ప్రయోగాత్మకంగా చెప్తున్నానన్నారు.. గ్రామాల్లో పాడి పరిశ్రమ అభివృద్ధికి కూడా చర్యలు తీసుకోవాలని సూచించారు. తద్వారా వచ్చే ఎరువు సేంద్రియ వ్యవసాయానికి ఉపయోగపడుతుందని సూచించారు..రైతులకు కరెంట్ మీటర్ల  ఏర్పాటు గురించి  అవగాహన కల్పించాలని సూచించారు ..


కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ నాడు  వైయస్ రాజశేఖర్ రెడ్డి రుణమాఫీ,ఉచిత విద్యుత్తు అమలు చేసి రైతు సంక్షేమానికి శ్రీకారం చుట్టారన్నారు.. నాడు వై ఎస్ హయాంలో  హంద్రీ నీవా కాలువ తవ్వితే డబ్బు కోసం చేస్తున్నారని విమర్శించారని, నేడు అదే హంద్రీ నీవా కాలువ ద్వారా రాయలసీమ జిల్లాలు సస్య శ్యామలం అవుతున్నాయని తెలిపారు.. నేడు మన ముఖ్యమంత్రి గ్రామాల్లో పాలన వ్యవస్థను ప్రజలు ముంగిటికి తీసుకువచ్చారని, గ్రామానికి ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ ద్వారా రైతులకు సేవలు అందించడం జరుగుతోందన్నారు .


కర్నూలు జిల్లా వ్యవసాయ సలహా మండలి  చైర్మన్ బెల్లం మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఆర్.బి.కెలు, సచివాలయాలు ముఖ్యమంత్రి కి రెండు కళ్ళు అని తెలిపారు.. గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయన్నారు . ఈ కేవైసీ, ఈ క్రాప్  బుకింగ్ లో అధికారులు సమర్థవంతంగా పనిచేస్తున్నారని తెలిపారు .


నంద్యాల జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జింక్, జిప్సం పంటల ఉత్పత్తిలో కీలకమని, వీటిని రైతులకు అందుబాటులో ఉంచాలని,చెరువుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.  గతంలో విత్తన పంపిణీలో రైతులే ఎన్నో కష్టాలు పడ్డారని, నేడు ఆ పరిస్థితి లేకుండా ఆర్బికేల ద్వారా విత్తన పంపిణీ జరుగుతోందని తెలిపారు .


కే డి సి సి బ్యాంక్ చైర్మన్ మహాలక్ష్మి మాట్లాడుతూ రైతులకు కొత్త రుణాలు 10 కోట్లు అందజేశామని తెలిపారు..


రైతులు అడిగిన ప్రశ్నలకు సంబంధిత శాఖల అధికారులు సమాధానం ఇచ్చారు..


ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి, ఇతర అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు..



Comments