B k V ఎక్స్ప్రెస్ హైవే భూసేకరణ పనులు వేగవంతం చెయ్యాలి
జిల్లా సంయుక్త కలెక్టర్ టీఎస్ చేతన్
పుట్టపర్తి, సెప్టెంబర్,22 (ప్రజా అమరావతి): బెంగళూరు వయా కడప వయా విజయవాడ హైవే కి సంబంధించిన భూసేకరణ పనులు వేగవంతం చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లాలో ఉన్న ఆర్డిఓ లతో, తాసిల్దార్ లతో, మండల సర్ వేర్లతో ఎక్స్ప్రెస్ హైవే కి సంబంధించిన భూసేకరణ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ల్యాండ్ సర్వేర్ సహాయ సంచాలకులు రామకృష్ణ, పుట్టపర్తి ఆర్డిఓ భాగ్య రేఖ, కదిరి ఆర్డీవో రాఘవేంద్ర, ధర్మారం ఆర్ డి ఓ తిప్పే నాయక్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. నవంబర్ మాసం లోపు సర్వే పనులు పూర్తిచేయాలని తెలిపారు. హైవే కి సంబంధించిన ప్రభుత్వ భూమిని వెంటనే ఎన్ హెచ్అధికారులకు అందజేయాలని ఎమ్మార్వో లను ఆదేశించారు. ప్రతి గ్రామంలో మండల సర్వేలు, విఆర్ వో లు టీములుగా ఏర్పడి భూమి కోల్పోయిన ప్రతి రైతు ని పలకరించి రైతులు ఆధార్ కార్డు, వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్ నెంబరు తదితర విషయాలను నమోదు ప్రక్రియ చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు, సుమారు 14 36 మంది రైతులు ఉన్నారని,412.65 హెక్టార్ల భూమి సేకరించడం జరిగిందని తెలిపారు. మండల సర్వేలు గ్రామాలలో పర్యటించి 50 మంది రైతులు ఉన్న గ్రామాలలో మార్కెట్ వాల్యూ ప్రకారము వివరాలు సేకరించాలని, అక్టోబర్ 5వ తేదీన ఆ కార్యక్రమం పూర్తిచేయాలని తెలిపారు, 51 మంది రైతులు 100 లోపు ఉన్న రైతులకు అక్టోబరు 10వ తేదీ లోపల మార్కెట్ వాల్యూ ప్రకారము భూ వివరాలు సేకరించాలని తెలిపారు. 101 ఆ పైన ఉన్న రైతులను అక్టోబర్ 15వ తేదీ లోపు మార్కెట్ వాల్యూ ప్రకారము భూమి వివరాలు సేకరించాలని ఆదేశించారు, గోరంట్ల మండలం లో వాన వాలు రైతులు 132 మంది ఉన్నారని, నల్లమడ మండలం లో నల్లమాడ నందు 268 మంది రైతులు, నల్లమడ మండలం వాన కర్లకుంట 130 రైతులు ఉన్నారని, మలక వేముల 116 మంది రైతులు ఉన్నారని త్వరితగతిన వివరాలు సేకరించి నమోదు నమోదు ప్రక్రియ చేపట్టాలని తెలిపారు ఈ కార్యక్రమం అంతా నవంబర్ 28వ తేదీ లోపు పనులు పూర్తి చేయాలి ఆదేశించారు
ఈ కార్యక్రమంలో ఎన్.హెచ్ అధికారి రామకృష్ణ, సబ్ రిజిస్టార్, గోరంట్ల, నల్లమడ, od cheruvu, కదిరి ముదిగుబ్బ, తలుపుల ,చిలమత్తూరు, పుట్టపర్తి తహసీల్దార్లు పాల్గొన్నారు
addComments
Post a Comment