కేసులను సత్వరం పరిష్కరించే దిశగా కృషి చేయాలి

 అమలాపురం సెప్టెంబర్ 23 (ప్రజా అమరావతి): షెడ్యూల్ కులాలు మరియు తెగల అట్రాసిటీ చట్టం కింద నమోదైన కేసులను సత్వరం పరిష్కరించే దిశగా కృషి చేయాల


ని స్థానిక పార్లమెంట్ సభ్యురాలు చింతా అనురాధ  సంబంధిత అధికారు లను ఆదేశించారు. శుక్రవారం స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయంలో ఆర్డీవో అధ్యక్షతన  పౌర హక్కుల రక్షణ ఎస్సీ ఎస్టీలపై దురాగతాల నివారణ చట్టం అమలు (పి సి ఆర్ %% పి ఓ ఏ యాక్ట్) పై డివిజన్ స్థాయి అప్రమత్తత పర్యవేక్షణ కమిటీ సమావేశమై చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యురాలు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు న్యాయ, పోలీస్, రెవెన్యూ సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. నిజమైన బాధితులకు న్యాయం జరిగిన ప్పుడు ఈ చట్టం ముఖ్య ఉద్దేశం నెరవేరుతుందన్నారు. కేసులు సత్వర విచారణకు అవసరమైన చార్జిషీటు దాఖల్లో ఎటువంటి జాప్యం జరగకుండా చూడాల న్నారు. అదేవిధంగా ఆయా కేసులకు సంబంధించి జారీ చేయ వలసిన కుల ధ్రువీకరణ పత్రాలను వారం రోజుల్లోగా పూర్తి చేయా లన్నారు. ఈ సందర్భంగా ఆర్డిఓ వసంతరాయుడు  కేసు రిజిస్టరయి 60 రోజులు దాటిన చార్జిషీటు దాఖలు కాని కేసుల వివరాలను ఆయన వాకబు చేశారు. ఎస్సీ, ఎస్టీల ద్వారా నమోదైన కేసుల సత్వర విచారణకు ఉద్దేశింపబడిన ప్రత్యేక కోర్టులో కేసుల సత్వర పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు.  డివిజన్ స్థాయిలో నమోదైన అట్రాసిటీ కేసులు ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మండల స్థాయిలో ప్రతి నెల 30వ తేదీన సివిల్ రైట్స్ డే సమావేశాలను తప్పనిసరిగా నిర్వహించాలన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం పట్ల ప్రజల్లో పరిపూర్ణ అవగాహన కల్పించాలన్నారు. తొలుత మండలాల వారీగా  వారీగా ఎస్సీ ఎస్టీ కేసులు పరిష్కార పురోగతిని ఆయన సమీక్షించారు. ప్రస్తుతo డివిజన్ పరిధిలో 126 కేసులు కేసులు నమోదు కాగా వీటిలో 63 కేసులు ఎఫ్ఐఆర్ స్టేజిలో నష్టప రిహారాలు అందించడం జరిగిందని ఎఫ్ఐఆర్ స్టేజిలో ప్రతిపాదించినవి 40 కేసులు కాగా ఎఫ్ఐఆర్ స్టేజిలో పెండింగ్లో తాసిల్దార్ వద్ద ఉన్నవి 23 కేసులు అని తెలిపారు   చార్జి సీటు స్థాయిలో 17 కేసులకు నష్టపరిహా రాల అందించామన్నారు. 12 కేసులు సంబంధించి చార్జి సీటు ప్రతిపాదనలు జిల్లా కలెక్టర్ వారి సమర్పించడం జరిగిందన్నారు. చార్జి సీటు స్థాయిలో పేమెంట్ పెండింగ్ కేసులు 48 ఉన్నాయని, 49 కేసులకు చార్జ్ సీటు దాఖలు చేయాల్సిందన్నారు. విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించడంలో కొంచెం జాప్యం జరిగిందని నష్టపరిహారాలు కూడా సకాలంలో అందించలేకపోయామని తెలిపారు  ఈనెల 30వ తేదీన జిల్లా కలెక్టర్ వారు విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ జిల్లా స్థాయి సమావేశం నిర్వహించనున్నారని ఈలోగా పెండింగ్ అంశాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని ఆయన అధికారులను కోరారు ఈ సమావేశంలో కమిటీ సభ్యులు.  ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల సంబంధించి పలు అంశాలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమావేశంలో డీఎస్పీ వై మాధవరెడ్డి ,సిఐ కొండలరావు ఎస్సై సురేష్ బాబు సాంఘిక సంక్షేమ అధికారి సత్యనారాయణ మండల అభివృద్ధి అధికారులు తాసిల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Comments