*శాసన సభ ఉప సభాపతిగా బాధ్యతలను చేపట్టిన కోలగట్ల వీరభద్రస్వామి
*
*•నిష్పక్షపాతంగా వ్యవహరిస్తూ శాసన సభ సమావేశాలు సజావుగా సాగే విధంగా చూస్తాను*
అమరావతి, సెప్టెంబరు 20 (ప్రజా అమరావతి): ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఉప సభాపతిగా ఎన్నికైన విజయనగరం శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి మంగళవారం ఉదయం ఉప సభాపతిగా బాధ్యతలను చేపట్టారు. అమరావతిలోని ఆంద్రప్రదేశ్ శాసన సభ భవనంలో వారికి కేటాయించిన ఛాంబరులో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన తదుపరి ఆయన ఈ బాధ్యతలను చేపట్టారు. ఉప సభాపతిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పలువురు మంత్రులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ్యులు ఆయన పుష్పగుచ్చాలు అందజేస్తూ అభినందనలు తెలిపారు.
సోమవారం జరిగిన శాసన సభ సమావేశంలో కోటగట్ల వీరభద్రస్వామి ఉప సభాపతిగా ఏకగ్రీవంగా ఎంపికైనట్లు శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించిన వెంటనే సభాపతి సీటులో వీరు కూర్చొని కొంత సేపు సభను నిర్వహించడంతోనే వీరు ఉప సభాపతిగా బాధ్యతలను చేపట్టడం జరిగింది. అయితే ఉప సభాపతిగా బాధ్యతలను చేపట్టే అధికార ప్రక్రియను నేడు ఆయనకు కేటాయించిన ఛాంబరులో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించిన తదుపరి మాత్రమే పూర్తిచేశారు.
ఈ సందర్బంగా ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తనపై ఎంతో నమ్మకాన్ని ఉంచి ఎంతో గురుతరమైన బాధ్యతను తనకు అప్పగించినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. వారి నమ్మకాన్ని ఏ మాత్రం ఒమ్ముచేయకుండా తనకు అప్పగించిన గురుతర బాధ్యతలను నిష్పక్షపాతంగా నిర్వహిస్తూ శాసన సభా సమావేశాలు సజావుగా సాగే విధంగా తన శక్తి వంచనలేకుండా కృషిచేస్తానని ఆయన అన్నారు.
ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమం) పీడిక రాజన్న దొర, ప్రభుత్వ విఫ్ కరణం ధర్మశ్రీ, విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన చంద్రశేఖర్, శాసన మండలి సభ్యులు డా.పెనుమత్స వరాహ వెంకట సూర్యనారాయణ రాజు, పాకలపాటి రఘు వర్మ, పాలవలస విక్రాంత్, శాసన సభ్యులు బొత్స అప్పల నర్సయ్య, శంబంగి వెంకట చిన అప్పల నాయుడు, కడుబండి శ్రీనివాసరావు, బడ్డుకొండ అప్పల నాయుడు, అన్నంరెడ్డి అదీప్ రాజ్,యు.వి.రమణ మూర్తి రాజు, చెట్టి పాల్గుణ తదితరులు శాసన సభ ఉప సభాపతిగా నూతంగా బాధ్యతలను చేపట్టిన కోలగట్ల వీరభద్ర స్వామికి పుష్పగుచ్చాలు అందజేస్తూ అభినందనలు తెలిపారు.
addComments
Post a Comment