*'ఏపీఐఐసీ' వీసీ, ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ నారాయణ భరత్ గుప్తా*
*డిప్యుటేషన్ ముగియడంతో మాతృశాఖకు బదిలీ అయిన మాజీ వీసీ,ఎండీ సుబ్రమణ్యం జవ్వాది*
అమరావతి, సెప్టెంబర్, 29 (ప్రజా అమరావతి); డాక్టర్ నారాయణ భరత్ గుప్తా 'ఏపీఐఐసీ' వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న ఆయన గురువారం ఏపీఐఐసీ వీసీ, ఎండీగా కొత్త బాద్యతలు చేపట్టారు. డిప్యూటేషన్ ముగియడంతో మాజీ ఏపీఐఐసీ వీసీ, ఎండీ సుబ్రమణ్యం జవ్వాదిని మాతృశాఖకు బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నంబర్ 1860 ఉత్తర్వులు జారీ చేసింది. మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో మాజీ ఎండీ సుబ్రమణ్యం కొత్త ఎండీ భరత్ గుప్తాకి బాధ్యతలు అప్పగించిన అనంతరం ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సుదర్శన్ బాబు, రాజేంద్రప్రసాద్ సహా ఉన్నతాధికారులంతా ఎండీ భరత్ గుప్తాకి స్వాగతం పలికారు. మాజీ ఎండీ సుబ్రమణ్యం అధికారులందరినీ కొత్త ఎండీ భరత్ గుప్తాకు పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు సుదర్శన్ బాబు, రాజేంద్రప్రసాద్, ఎండీ ఓఎస్డీ నాగిరెడ్డి, సీజీఎం (అసెట్ మేనేజ్ మెంట్) ఎల్.రామ్, కంపెనీ సెక్రటరీ శివారెడ్డి, సీజీఎం (ఫైనాన్స్) సుబ్బారెడ్డి, సీజీఎం (పర్సనల్) జ్యోతి బసు, ఇంజనీర్ ఇన్ చీఫ్ ప్రసాద్, చీఫ్ ఇంజనీర్ వివేకనందరెడ్డి, జనరల్ మేనేజర్లు గెల్లి ప్రసాద్, నాగ్ కుమార్, చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ వెంకట్, కేపీఎంజీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment