సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర, భీమవరం, (ప్రజా అమరావతి);


    సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర,


ఉపాధ్యాయులకు టీచర్స్ డే శుభాకాంక్షలు.

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,  దేవాదాయ శాఖ మంత్రి శ్రీ కొట్టు సత్యనారాయణ.


 తల్లి తండ్రులు తరువాత స్థానం   గురువుదేనని ,సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయులదే కీలక పాత్ర అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ కొట్టు సత్యనారాయణ  అన్నారు. 

      టీచర్స్ డే సందర్భంగా స్థానిక  బి వి రాజు ఇంజినీరింగ్ కళాశాల సమావేశ మందితంలో సోమవారం ఉత్తమ ఉపాద్యాయ పురస్కార ప్రదానోత్సవం -2022 కార్యక్రమానికి  రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి , దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ కొట్టు సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్ర పటానికి పూలమాల వేసి , జ్యోతి ప్రజ్వలన గావించి ఉత్తమ ఉపాద్యాయ పురస్కార ప్రదానోత్సవం -2022 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముందుగా జిల్లా నుండి ఎంపికైన ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపి గురుపూజోత్సవం గురించి వివరించారు.  ఉపాధ్యాయుడు అంటే చదువు నేర్పిన వాడే ఉపాధ్యాయుడు కాదని మనం ఏ వృత్తి ఎంచుకున్న అందులో మనం నైపుణ్యం సాధించే విధంగా  మనల్ని ప్రోత్సహించిన వాడే గురువు అని ఆయన అన్నారు. గురువు తన శిష్యులను సక్రమంగా తయారు చేయకపోయినట్లయితే కొన్ని తరాలకు నష్టమని ఆయన అన్నారు. గురువులు అంకితభావంతో పనిచేసి దేశం కోసం ఉపయోగపడే విధంగా పౌరులను తయారు చేయాలని ఆయన సూచించారు.గురువు వృత్తి పవిత్రమైనదని దాన్ని సంపూర్ణంగా స్వీకరించాలని ఆయన అన్నారు . రాష్ట్రం ముఖ్యమంత్రి విద్య కోసం అనేక విప్లవాత్మమైన మార్పులు తీసుకువచ్చారని , నాడు - నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చడంతో పాటు విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి వారికి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్య అందించేందుకు కృషి చేస్తున్నారని ఆయన అన్నారు .  విద్యార్థులను పాఠశాలలకు పంపించేందుకు. ప్రోత్సాహకంగా అమ్మఒడి పథకం ప్రవేశపెట్టారని , జగనన్న విద్యా దీవెన, జగన్నాన వసతి దివేన , జగనన్న గోరుముద్ద  వంటి పథకాలు ప్రవేశపెట్టి విద్యార్థులు విద్యా నైపుణ్యాలు మెరుగుపరిచేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కృషిచేస్తున్నారని ఆయన తెలిపారు.


కార్యక్రమంలో జిల్లా కలెక్టర్. శ్రీమతి పి.ప్రశాంతి  మాట్లాడుతూ పురస్కార గ్రహీతలకు, కార్యక్రమంలో పాల్గొన్న వారికి టీచర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. అందరూ గురువులకు కృతజ్ఞతలు తెలిపారు. పిల్లలకు ఉత్తమ విద్యను అందించి వారు ఉన్నత స్థానానికి చేరుకునేలా తీర్చిదిదాలన్నారు. ఈ సందర్భంగా తనకు విద్య నేర్పిన గురువులను గుర్తు తెచ్చుకున్నారు. మంచి విద్యా కుసుమాలను అందించే వారే ఉపాధ్యాయులని ఎవరు ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తికి అయినా వారి జీవితంలో ఒక ఉపాధ్యాయులు ఉంటారని అతని జీవితంలో ఆ ఉపాధ్యాయుని గురించి ఎప్పుడూ తలుసుకుంటూ ఉంటారని ఆమే అన్నారు.  టీచర్ అనేవాడు తనను తాను అప్డేట్ చేసుకుంటూ విద్యార్థులను అప్డేట్ చేస్తారని,  టీచర్ స్టూడెంట్స్ లో జిజ్ఞాసను పెంపొందించినప్పుడే విద్యార్థులు ఉన్నత స్థానాలకు వెళ్లడానికి అవకాశం కలుగుతుందని అన్నారు. టీచర్ అంటే  మంచి గుణవంతులను సమాజానికి అందించే బాధ్యత టీచరిది అని ఆమె అన్నారు . భారత రాష్ట్రపతిగా పనిచేసిన సర్వేపల్లి రాధాకృష్ణ తను రాష్ట్రపతిగా కంటే ఉపాధ్యాయుడిగా గౌరవించడమే ఉత్తమమని అన్నారని అదేవిధంగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్  కూడా తన్నే రాష్ట్రపతి, మిసైల్ మాన్ అనేకంటే ఉపాధ్యాయుడుగానే గుర్తించమని అన్నారని దానినిబట్టి  భారత రాష్ట్రపతి కంటే టీచర్ నిర్వహిస్తున్న బాధ్యత గొప్పదని కలెక్టర్ అన్నారు. ఉపాద్యాయులు సర్వేపల్లి రాధాకృష్ణన్ అడుగుజాడల్లో నడవాలని మీ వద్ద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని, విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.


ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన భీమవరం ఎమ్మెల్యే శ్రీ గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో గురువుకి అత్యున్నత స్థానం ఇచ్చారని ఆయన అన్నారు.  ఉపరాష్ట్రపతిగా,  రాష్ట్రపతిగా పనిచేసిన శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతిని ఉపాధ్యాయ దినోత్సవం గా జరుపుకోవడం ఎంతో శుభ పరిమాణం అని ఆయన అన్నారు.  తల్లిదండ్రులు జన్మనిస్తే వెలుగు వైపు విజ్ఞానం వైపు తీసుకెళ్లే వారే ఉపాధ్యాయుడు అని ఆయన అన్నారు. దుఃఖంతో ప్రారంభమైన మనిషి జీవితాన్ని విద్య అనే సంపదను మనకు అందించి మార్గాన్ని చూపిన వారు ఉపాధ్యాయులని ,  ఉపాధ్యాయ దినోత్సవం ప్రాధాన్యతను అందరూ గ్రహించాలని ఆయన అన్నారు. అందరూ నిత్య విద్యార్డులేనని,  మనిషి పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు నేర్చుకుంటేనే ఉంటారని ఆయన అన్నారు.  ఉపాధ్యాయుల దినోత్సవం లో ఉపాధ్యాయుల విద్యార్థులను దేశ సంపదగా తయారు చేసే విధంగా ఆలోచించాలని ఆయన సూచించారు.కార్యక్రమంలో  విద్యార్థినులు పలు నృత్యరూపకాలు ప్రదర్శించారు . 

           గురు పూజోత్సవం సందర్భంగా  జిల్లాలో ఎంపికైన  ఉపాధ్యాయులకు దుషాలువా కప్పి, జ్ఞాపికలను అందజేసి సన్మానించారు.


పాఠశాల విద్యాశాఖ మరియు సమగ్ర శిక్ష నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి ఆర్. వెంకటరమణ, సమగ్రా శిక్ష అభియాన్ అసిస్టెంట్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్యాంసుందర్, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి సర్రాజు ,

ఉపాద్యాయలు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


     


Comments