పనే దైవం అనుకుంటేనే ఆకాశమంత ఎదగుతాం :ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్ట గోవింద రెడ్డిపనే దైవం అనుకుంటేనే ఆకాశమంత ఎదగుతాం :ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్ట గోవింద రెడ్డి


ముఖ్యమంత్రి నాయకత్వంలో అందరికీ న్యాయం


సంస్థ కోసం పని చేయండి..ఆ సంస్థే మిమ్మల్ని కాపాడుకుంటుంది


ప్రభుత్వ జీవో 7 అమలు చేసి జీతం పెంచినందుకు కృతజ్ఞతలు తెలిపిన ఏపీఐఐసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు


మా ప్రతి సమస్యపై స్పందించిన మొట్టమొదటి ఎండీ మీరే : ఏపీఐఐసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు


ఏపీఐఐసీ విభాగాధిపతులను(హెచ్ఓడీ) కలిసి ధన్యవాదాలు వెల్లడి


అమరావతి, సెప్టెంబర్, 15 (ప్రజా అమరావతి): పనే దైవం అనుకుని ఆకాశమే హద్దుగా ఎదగాలని ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవింద రెడ్డి వెల్లడించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో అందరికీ న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.    ప్రభుత్వ జీవో 7 అమలుతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పెరగడం పట్ల ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డిని ఆయన కార్యాలయంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారిలో స్ఫూర్తిని నింపేలా ఛైర్మన్ మాట్లాడారు. వస్త్ర పరిశ్రమలో సాధారణ ఉద్యోగిలా చేరి పట్టుదల, నిజాయితీతో 5000 మంది ఉద్యోగాలిచ్చే గార్మెంట్ పరిశ్రమ స్థాపన వెనుక కృషిని, తన ప్రస్థానాన్ని  ఛైర్మన్ వారితో పంచుకున్నారు.ఎరొచ్చినా, ఏ సమస్య చెప్పినా ఎండీగా సత్వరం స్పందించిన మొట్టమొదటి ఏపీఐఐసీ వీసీ, ఎండీ మీరేనంటూ ఏపీఐఐసీ చిరుద్యోగులు సుబ్రహ్మణ్యం జవ్వాది గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీఐఐసీ ఉద్యోగులందరికీ  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 7 మార్గదర్శకాలను అమలు చేసి సుమారు 400 మంది ఉద్యోగుల కుటుంబాలకి అండగా నిలిచారంటూ వారు హర్షం వ్యక్తం చేశారు. నిబద్ధతగా కష్టపడి పని చేసేవారికి అదనంగా ఇన్సెంటివ్ లు కూడా పండుగ కానుకగా అందించడం ఎండీ మంచి మనసుకు నిదర్శనంగా పేర్కొంటూ ఏపీఐఐసీ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సుబ్రమణ్యం జవ్వాదికి ఔట్ సోర్సింగ్ విధానంలో పని చేసే ఉద్యోగులందరి తరపున మంగళగిరి ప్రధాన కార్యాలయం సిబ్బంది కృతజ్ఞతలు వెల్లడించారు. 


గత జూన్ 28వ తేదీన నిర్వహించిన 234 ఏపీఐఐసీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకుని హెచ్ఓడీలంతా పూర్తి సహకారం అందించడం తమ పట్ల వారికిగల నిబద్దతగా పేర్కొన్నారు.  వినాయక చవితి కానుకగా  అందజేసి తమ ఆర్థిక విఘ్నాలన్నీ తొలగించిన ఏపీఐఐసీ ఉన్నతాధికారుల పెద్దమనసుకు రుణపడి ఉంటామంటూ హెచ్ఓడీలను మర్యాదపూర్వకంగా కలిశారు.  ప్రతి ఒక్కరూ సంస్థ ఉన్నతి కోసం పని చేయాలని ఎండీ శుభాకాంక్షలు తెలిపారు. కాస్త ఆలస్యమైనా కష్టమే నిలబడుతుంది, అదే మిమ్మల్ని నిలబెడుతుందన్నారు. ఒక్కసారిగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులంతా కలిసి రావడం పట్ల పలువురు హెచ్ఓడీలు స్ఫూర్తిని నింపేలా పనిచేస్తూ పోతుంటే ఫలితం పరిగెడుతూ మీ వెంటే వస్తుందని సంతోషంగా శుభాకాంక్షలు తెలిపారు. Comments