గడప గడపకు మన ప్రభుత్వం

 *గడప గడపకు మన ప్రభుత్వం


*

తెనాలి (ప్రజా అమరావతి);

గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయడమే లక్ష్యంగా మన తెనాలి నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 'గడపగడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో భాగంగా నేడు పట్టణం లోని 34వ వార్డులో ఇంటింటికి పర్యటించి లబ్ధిదారులకు ప్రభుత్వం ద్వారా వారికి అందుతున్న సంక్షేమ లబ్ది వివరాల కరపత్రాలు అందజేయడం జరిగింది.


వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న నవరత్నాలతో కేవలం పేదలకు మాత్రమే లబ్ది జరుగుతుంది అనే అపోహ ఇన్నిరోజులు ప్రజలలో నెలకొంది అని,కానీ నేడు మా పర్యటన జరిగిన ఈ కాలనీలు,అపార్ట్మెంట్ లు ఎక్కువగా ఉన్న కమర్షియల్ ప్రాంతం అధికంగా  ఉన్న ప్రాంతంలో ప్రతి అపార్ట్మెంట్ లో నివసించే వారికి కూడా రైతు భరోసా, అమ్మఒడి లాంటి ఎన్నో సంక్షేమ పధకాలు అందాయని వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ లబ్ది జరుగుతుంది అనడానికి ఇదే నిదర్శనం.

Comments