తిరుమల
5 సెప్టెంబర్ (ప్రజా అమరావతి);
అహ్మదాబాద్ లో శ్రీవారి ఆలయ నిర్మాణానికి భూమి ఇస్తాం
- టీటీడీ చైర్మన్ కు సి ఎం హామీ
అహ్మదాబాద్ లో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణానికి అనువైన భూమి కేటాయిస్తామని గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర రజనీకాంత్ పటేల్ హామీ ఇచ్చారు.
టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి పాలక మండలి సభ్యులు శ్రీ కేతన్ దేశాయ్ తో పాటు సోమవారం ముఖ్యమంత్రి ని కలిశారు.
సి ఎం కు శ్రీవారి ప్రసాదం అందించి శాలువలతో సత్కరించారు.
ఈ సందర్భంగా చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ దేశవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మ ప్రచారానికి చేపట్టిన చర్యలను ముఖ్యమంత్రి కి వివరించారు. జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణం జరుగుతోందని, ఇటీవలే భువనేశ్వర్ లో శ్రీవారి ఆలయం ప్రారంభించామన్నారు. త్వరలోనే ముంబైలో స్వామివారి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నామని చెప్పారు. గుజరాత్ లో కూడా స్వామివారి ఆలయ నిర్మాణానికి టీటీడీ కి ఉచితంగా భూమి కేటాయించాలని కోరారు. శ్రీ సుబ్బారెడ్డి ప్రతిపాదన పట్ల గుజరాత్ ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. అధికారులతో చర్చించి టీటీడీ కి అనువైన ప్రదేశంలో అవసరమైనంత భూమి కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
addComments
Post a Comment