ఇంద్రకీలాద్రి: సెప్టెంబర్ 29 (ప్రజా అమరావతి);
శరన్నవరాత్రులు ఎటువంటి లోటుపాట్లకు తావులేని విధంగా సజావుగా జరుగుతున్నాయ
ని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.
గురువారం ఇంద్రకీలాద్రి మీడియా సెంటర్ నుండి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మాట్లాడుతూ శరన్నవరాత్రులు ప్రారంభమై నాలుగు రోజులు గడిచాయని, భక్తులకు కొరకు ఏర్పాటు చేసిన సౌకర్యాల వలన అమ్మవారి దర్శనానికి ఎటువంటి ఆటంకం లేకుండా దర్శనం చేసుకొగలుగుతున్నారని తెలిపారు. క్యూలైన్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, భక్తులతో మాట్లాడడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరు ఏర్పాట్లపై సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చేసిన ఏర్పాట్ల వలన సామాన్య భక్తులు కూడా సౌకర్యవంతమైన దర్శనం చేసుకోగలుగుతున్నారని అన్నారు.
ఎప్పటికప్పుడు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం పనిచేస్తున్నారని కితాబ్ ఇచ్చారు. జిల్లా కలెక్టర్, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో దసరా శరన్నవరాత్రులు ఇప్పటివరకు సజావుగా జరిగాయని, రానున్న ఐదు రోజులు కూడా ఇదే ఉత్సాహంతో అధికారులు పనిచేసి శరన్నవరాత్రి ఉత్సవాల విజయవంతానికి కృషి చేయాలని మంత్రి కోరారు.
addComments
Post a Comment