గుడివాడ నియోజకవర్గంలో మూడు రోజులు పాటు జరిగే మహా పాదయాత్రకు మద్దతు తెలపండి

 *- గుడివాడ నియోజకవర్గంలో మూడు రోజులు పాటు జరిగే మహా పాదయాత్రకు మద్దతు తెలపండి


 *- తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్* 



గుడివాడ సెప్టెంబర్ 22 (ప్రజా అమరావతి): గుడివాడ నియోజకవర్గంలో మూడు రోజులపాటు జరిగే అమరావతి టు అరసవెల్లి మహా పాదయాత్రకు మద్దతు తెలపాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి కోఆర్డినేటర్ శిష్ట్లా లోహిత్ పిలుపునిచ్చారు. గురువారం కృష్ణాజిల్లా గుడివాడలో శిష్ట్లా లోహిత్ ఒక ప్రకటన విడుదల చేశారు. అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న మహా పాదయాత్ర ఈ నెల 23, 24, 25 తేదీల్లో గుడివాడ నియోజకవర్గంలో అడుగుపెడుతుందని తెలిపారు. ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదంతో ఈ మహా పాదయాత్ర జరుగుతోందని చెప్పారు. రాష్ట్ర రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు చెదిరేలా గుడివాడ నియోజకవర్గంలో ఈ మహా పాదయాత్ర జరుగుతుందని చెప్పారు. ప్రజా రాజధాని అమరావతి అనే నినాదాన్ని ఈ మహా పాదయాత్ర ద్వారా చాటి చెబుతామన్నారు. గుడివాడ నియోజకవర్గం పరిధిలోని రైతులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ట్రేడ్ యూనియన్ల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ మహా పాదయాత్రకు సంఘీభావం తెలపాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజల ఆకాంక్షలను గౌరవించాలని కోరారు. ప్రజలంతా అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేయాలని కోరుతున్నట్టు తెలిపారు. ప్రజా రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్న ప్రజల అభీష్టాన్ని ప్రభుత్వానికి తెలియజేసేందుకే ఈ మహా పాదయాత్రను చేపట్టినట్టు వివరించారు. ప్రభుత్వం స్పందించి అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని శిష్ట్లా లోహిత్ సూచించారు.

Comments