శాససనభ డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి


అమరావతి (ప్రజా అమరావతి);


*శాససనభ డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన శ్రీ కోలగట్ల వీరభద్రస్వామి


.*


*డిప్యూటీ స్పీకర్‌ శ్రీ కోలగట్ల వీరభద్రస్వామిని అభినందించిన సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.* 


*ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం ఏమన్నారంటే...:* 


రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా కోలగట్ల వీరభద్రస్వామి ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉంది. మిమ్నల్ని ఎప్పుడూ నేను ఆప్యాయంగా స్వామి అన్న అని పిలుస్తూ ఉంటాను. అలాంటి మిమ్నల్ని ఈ రోజు ఈ స్ధానంలో కూర్చోబెట్టడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది. రెండు సార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు ఎమ్మెల్సీగా మీరు ఈ చట్టసభల్లోకి వచ్చారు. మొట్టమొదటిసారిగా 2004లో తొలిసారిగా శాసనసభకు ఎన్నిక కావడం, ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ ఆ పదవి నుంచి వైదొలిగి, రాజీనామా చేసి వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. అప్పటి నుంచి చూస్తే... 2019లో మరలా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.  ఇప్పుడు డిప్యూటీ స్పీకర్‌గా ఆ స్థానంలో కూర్చోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా మీ కన్నా ముందు డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న కోన రఘుపతి చేసిన మంచి కూడా సభ ద్వారా అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. రెండున్నర, మూడు సంవత్సరాలు పాటు తాను డిప్యూటీ స్పీకర్‌గా పనిచేసారు. ఇంకో సామాజిక వర్గానికి స్దానం ఇవ్వాలి అని అనుకుని, తనతో చర్చించినపుడు, తాను కూడా మనస్ఫూర్తిగా ఇది మంచి నిర్ణయం అన్నారు.  మన పార్టీలో అందరం ఐదు సంవత్సారాలు కొనసాగడం కన్నా.. మూడు సంవత్సాలు కొంతమందిని, మిగతా రెండు సంవత్సరాలు ఇంకా కొంతమందిని తీసుకొచ్చి, వీలైనంత ఎక్కువ మందికి ప్రాధాన్యతనిచ్చే కార్యక్రమం జరుగుతుంది. అది చాలా మంచిదనే మాట తాను చెబుతూ.. ఎటువంటి బాధ లేకుండా చిరునవ్వుతోనే స్వాగతించాడు.


మీరు డిప్యూటీ స్పీకర్‌గా ఈ చట్టసభలో అందరికీ న్యాయం చేసే విధంగా మంచి చేయాలని చెప్పి ఆశిస్తూ... మరొక్కసారి మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. మంచి జరగాలని కోరుకుంటూ.. సెలవు తీసుకుంటున్నానని సీఎం ప్రసంగం ముగించారు.

Comments