జాతీయ రోగ నియంత్ర‌ణ కేంద్రంతో ఎంతో మేలు


 మంగ‌ళ‌గిరి (ప్రజా అమరావతి);
*జాతీయ రోగ నియంత్ర‌ణ కేంద్రంతో ఎంతో మేలు


*

*మంగ‌ళ‌గిరిలో రూ.వంద కోట్ల‌తో నిర్మాణం*

*అన్ని రోగాల‌కు ఇక్క‌డ ఉచితంగా పరీక్ష‌లు*

*రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని*

*ఢిల్లీ నుంచి వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో ప్రారంభించిన కేంద్ర మంత్రి*


జాతీయ రోగ నిర్థార‌ణ‌, నియంత్ర‌ణ కేంద్రం వ‌ల్ల భ‌విష్య‌త్తులో ఎన్నో ఉప‌యోగాలు చేకూర‌నున్నాయ‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. న్యూఢిల్లీలోని ఎన్‌సీడీసీ (నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్) ప్ర‌ధాన కార్యాల‌యం ద్వారా దేశ వ్యాప్తంగా ఆరు ఎన్‌సీడీసీ సెంట‌ర్ల ఫౌండేష‌న్ స్టోన్ కార్య‌క్ర‌మాన్ని మంగ‌ళ‌వారం వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిన నిర్వ‌హించారు. ఢిల్లీ నుంచి కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ‌మంత్రి మాండ‌వీయ ముఖ్య అతిథిగా హాజ‌రై కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా  అరుణాచ‌ల్‌ప్ర‌దేశ్‌, త్రిపుర‌, మ‌హారాష్ట్ర‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, కేర‌ళ‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో ఈ సెంట‌ర్లను నిర్మించ‌నున్నారు. ఏపీ నుంచి ముఖ్య అతిథిగా మంత్రి విడ‌ద‌ల ర‌జిని హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ దాదాపు వంద కోట్ల నిధుల‌తో మంగ‌ళ‌గిరిలోని ఎయిమ్స్ స‌మీపంలో ఈ కేంద్రాన్ని నిర్మిస్తున్న‌ట్లు చెప్పారు.  స్వైన్ ఫ్లూ, డెంగీ, మ‌లేరియా, హెచ్ ఐవీ.. ఇలా అన్ని రోగాల‌కు ఈ సెంట‌ర్లో ఉచితంగా  నిర్థార‌ణ ప‌రీక్ష‌లు చేస్తార‌ని తెలిపారు. అతి త్వ‌ర‌లోనే దీని నిర్మాణానికి శంకుస్థాప‌న చేస్తామ‌న్నారు.

Comments