అన్ని రాజకీయ పార్టీలు అమరావతికి మద్దతు తెలిపాయి.రాష్ట్రంలో ఏ వ్యక్తి శాశ్వితం కాదు...


 విజయవాడ (ప్రజా అమరావతి);


అమరావతి: వివాదాలు – వాస్తవాలు పుస్తకాన్ని ఆవిష్కరించిన టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు.


కందుల రమేష్ రాసిన పుస్తక ఆవిష్కరణలో పాల్గొన్న పలు రాజకీయ పార్టీల నేతలు, మేథావులు, రైతులు.


కార్యక్రమంలో అమరావతి పాదయాత్ర ఉద్యమంపై రూపొందించిన గీతాల సిడిని ఆవిష్కరించిన చంద్రబాబు నాయుడు, జెఎసి నేతలు.


*చంద్రబాబు నాయుడు, టిడిపి అధినేత ప్రసంగం:-*


అన్ని రాజకీయ పార్టీలు అమరావతికి మద్దతు తెలిపాయి.రాష్ట్రంలో ఏ వ్యక్తి శాశ్వితం కాదు...మనం చేసే పనులు శాశ్వితం.మన చేసిన పాలన వల్ల రాజకీయ లబ్ది జరిగిందా....లేక ప్రజలకు మంచి జరిగిందా అని చూడాలి.

నాడు మంత్రిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణను ఇప్పుడే అడిగాను...ఎప్పుడైనా నాడు వైఎస్ఆర్ సైబరాబాద్ ను నిలిపివెయ్యాలి అనుకున్నారా అని...ఆయన ఎప్పుడూ వైఎస్ అలా ఆలోచన చెయ్యలేదు అన్నారు.శంషాబాద్ ఎయిర్ పోర్టుకు నా హయాంలో భూములు సేకరించా....తరువాత వచ్చిన వైఎస్ ఆర్ భూమిపూజ చేసి ప్రాజెక్టు పూర్తి చేశారు.నా తరువాత వచ్చిన ముఖ్యమంత్రులు అంతా నాడు హైదరాబాద్ లో ప్రాజెక్టులు కొనసాగించారు. అందుకే నేడు హైదరాబాద్ ఆ స్థాయికి చేరింది.ఇప్పుడు ప్రజలు అంతా మనం చేసిన పనులు గుర్తు చేసుకావాల్సిన అవసరం లేదు...కానీ ఒక తృప్తి అనేది ఎప్పుడూ ఉంటుంది.నాడు హైదరాబాద్ తో పాటు విశాఖ, తిరుపతి, విజయవాడ, వరంగల్ వంటి పట్టణాలు కూడా అభివృద్ది కావాలని ఆశించాను. ఆదాయం ఇచ్చే హైదరాబాద్ నగరం తెలంగాణకు వెళితే....మనకు ఆదాయం ఎలా అని ఇక్కడి ప్రజలు ఆలోచించారు.

నాకు ఉన్న అనుభవాన్ని గుర్తించి 2014లో ప్రజలు నాకు అధికారం ఇచ్చారు.హైదరాబాద్, సికింద్రాబాద్ కు విస్తరణలో సైబరాబాద్ నిర్మించాం.బిల్ క్లింటన్ వచ్చిన రోజునే సైబరాబాద్ అనే పేరు పెట్టాం.హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు ఉన్నాయి.పిపిపి పద్దతిలో నాడు హైటెక్ సిటీ కట్టాం...అక్కడినుంచి అభివృద్ది మొదలైంది.ఈ రోజు తెలంగాణ అభివృద్దికి హైదరాబాద్ కీలకంగా ఉంది.చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ ల వల్ల ఆయా రాష్ట్రాలకు ఆదాయం పెరిగింది.

అందుకే అమరావతి అనే కాన్సెప్ట్ తీసుకువచ్చాం.

రైతులు ముందుకు వస్తే....వారి భాగస్వామ్యంతో రాజధాని కడదాం అని ఒక ఆలోచన చేశాం.ముందుగా రైతులతో పలు మార్లు చర్చించాం...ఆ రైతులలో అన్ని పార్టీల వారూ ఉన్నారు.అభివృద్దికి ఎన్నికలకు సబంధం లేదు...నాడు ఖైరతాబాద్ లో ఓడిపోయాం....మొన్న తాడికొండలో ఓడిపోయాం.మంచి ప్యాకేజ్ ఇస్తే భూములు ఇవ్వడానికి సిద్దమే అని రైతులు అంగీకరించారు.ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ల్యాండ్ పూలింగ్ విధానం తీసుకువచ్చాం.

రాష్ట్రంలో రెండు చివరి ప్రాంతాలకు మధ్యలో ఉన్న ప్రాంతం అమరావతిగుంటూరు - విజయవాడ మధ్య సరైన ప్రాంతం అని గుర్తించాము.నేను రాయలసీమ వాడిని....కావాలి అంటే నాడు తిరుపతిలో రాజధాని పెట్టుకునేవాడిని.

రాష్ట్రానికి ఒక మంచి రాజధాని కట్టాలి అని...సింగపూర్ వెళ్లి మాస్టర్ ప్లాన్ చేసి ఇవ్వమని అడిగాను...సహాయం చెయ్యమని కోరాను.నాడు సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా మాస్టర్ ప్లాన్ ఇవ్వడానికి అంగీకరించింది.రైతుల భూములకు ప్యాకేజ్ కింద నివాస భూమి ఇచ్చా, కమర్షియల్ ల్యాండ్ ఇచ్చాం.రాజధాని ప్రాంతంలో పేదలకు పెన్షన్ లు కూడా ఇచ్చాం.ఈ రోజు అమరావతిని చూస్తే చాలా బాధ కలుగుతుంది. 1000 రోజులుగా రైతులు నిరసనలు చేస్తున్నారు. రైతుల ఉక్కుసంకల్పానికి అభినందనలుఅమరావతి ఉద్యమంలో ఆడవాళ్లను అవమానించారు. అయినా ఉద్యమం చేశారు.

వెయ్యి రోజుల ఆందోళన ఎక్కడా జరగలేదు.....ఇది అమరావతి రైతుల ఘనత.అమరావతి అనే పేరుపై అన్ని వర్గాలనుంచి ఆమోదం వచ్చింది.అమరావతిపై మాకు ఎటువంటి అభ్యంతరం లేదని నాడు వైసిపి నేతలు చెప్పారు.30 వేల ఎకరాలు కావాలని జగన్ అన్నారు....మేము ఇంకా ఎక్కువే తీసుకున్నాం.

విభజనతో వచ్చిన కేంద్ర సంస్థలను రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో పెట్టాము. అభివృద్దిని వికేంద్రీకరించాము.

అమరావతి పరిపాలన రాజధాని, వైజాగ్ ఆర్థిక రాజధాని, తిరుపతి పరిశ్రమల హబ్ చెయ్యాలి అనుకున్నాం.

కేంద్రం నిథులు ఇవ్వడానికి సిద్దంగా ఉన్నా పోలవరం ప్రాజెక్టును మధ్యలో ఆపేశారు.పోలవరం పూర్తి జరిగి ఉండే సీమ, ఉత్తరాంధ్ర లకు కూడా లబ్ది జరిగేది.

నాకు ఏమాత్రం అనుమానం లేదు. ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది.ధర్మాన్ని కాపాడుకోవడానికి త్యాగాలు కావాలి. ఆ త్యాగాలుకూడా ఇప్పుడు రైతులు చేస్తున్నారు.

అమరావతి సంకల్పం చాలా ఉన్నతమైనది. ఐదుకోట్ల కోసం అమరావతి తలపెట్టాం.పవిత్రమైన మట్టి, పవిత్రమైన జలాల ద్వారా నాడు అమరావతికి తీసుకువచ్చాం.

నాడు ప్రధాని యమునా జలం, పార్లమెంట్ మట్టిని తెచ్చారు. పార్లమెంట్ మీకు అండగా ఉంటుందని నాడు ప్రధాని చెప్పారు.ఆ సంకల్పం వృధాకాదు....అమరావతి గెలుస్తుంది.రాజధాని కట్టిన తరువాత అమరావతిలో 8000నుంచి 10000 ఎకరాలు ప్రభుత్వానికి మిగులుతుంది.నాడు కోకాపేట భూమి ఎకరా లక్ష రెండు లక్షలు ఉండేది...ఇప్పుడు 60 కోట్లు, 70 కోట్లు అయ్యింది.

ఇప్పుడు అమరావతి ఉండి ఉంటే ఇక్కడ కూడా రెండు లక్షల కోట్ల విలువైన ఆస్థి అందుబాటులోకి వచ్చేది.

ఇప్పటికీ ఉత్తరాంధ్రనుంచి పనుల కోసం, ఉపాథి కోసం హైదరాబాద్ వెళుతున్నారు.అదే అమరావతి ఉండి ఉంటే ఇక్కడే ఉపాధి దొరికేది. హైదరాబాద్ లో ఏ కులం ఉందని నాడు అభివృద్ది చేశాం.కులం కోసంకాదు....ఒక తృప్తి కోసం సైబరాబాద్ అభివృద్ది చేశాం.రైతుల పిల్లలు, కూలీల పిల్లలు కూడా ఐటి ఉద్యోగాలు చెయ్యాలని అన్నప్పుడు హేళన చేశారు. కానీ ఇప్పుడు అవన్నీ సాకారం అయ్యాయి.

సాధారణ కుటుంబాల నుంచి కూడా ఉన్నత ఉద్యోగాలకు వెళ్లారు. అమెరికాలో ఉండే అమెరికన్స్ కంటే....అక్కడ ఉన్న ఇండియన్స్ ఆదాయం డబుల్.ఏ దేశంలో అయినా ఎక్కువ ఆదాయం పొందే వారు ఇండియన్స్...వారిలో 30 శాతం మంది తెలుగు వారు.అమరావతికి పెద్దగా నిధుల అవసరం కూడా లేదు. ఒక్క పైసా ఖర్చు లేకుండా.....సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ గా అమరావతిని రూపొందించాము.

అమరావతిపై ఎన్నో అపవాదులు వేశారు..అన్నింటిని భరించాం.తెలుగు జాతికి అమరావతి లాంటి ఒక రాజధాని ఉండాలి.


Comments