బిక్కవోలు (ప్రజా అమరావతి);
** కోమరిపాలెం లో "గడప గడపకు మన ప్రభుత్వం" కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు.
అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం కొమరపాలెం గ్రామంలో సోమవారం సాయంత్రం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో
జిల్లా కలెక్టర్ డా. కే.మాధవీలత, ఎంపీ మార్గాని భరత్ రామ్, శాసనసభ్యులు సత్తి సూర్యనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ కే. మాధవీలత మాట్లాడుతూ, గడపగడపకు మన ప్రభుత్వంలో భాగంగా ప్రజలకు అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాల వివరాలను ప్రజల నుంచి తెలుసుకొని వారి సమస్యలు పరిష్కారం కోసం రావడం జరిగిందన్నారు. అర్హులకు సంక్షేమ కార్యక్రమాలు అందించడంలో పూర్తి పారదర్శకత పాటించడంతో పాటు సంక్షేమ కార్యక్రమాలు రానీ వ్యక్తులకు ఎందుకు రాలేదో వివరించడం జరిగిందన్నారు. సంక్షేమ పథకాలను అందించడంలో కుల, మత, వర్గ ప్రాంతాలకు అతీతంగా పథకాల వర్తింపు చేస్తున్నామన్నారు. కొమరిపాలెం గ్రామంలో ప్రభుత్వ పథకాలు పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. ఈ సమయంలో ప్రజల నుంచి ఎంత ఆత్మీయ స్వాగతం లభించిందన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు ఇటువంటి ఘటనలు నిదర్శనం అన్నారు. అదే విధంగా కొమరపాలెం గ్రామంలో ప్రజలకు సంబంధించిన ఇళ్ళ స్థలాలు స్థానిక ఎమ్మెల్యే చొరవ తో బలబద్రపురం లో గుర్తించడం జరిగిందన్నారు.
పార్లమెంట్ సభ్యులు మార్గని భరత్ రామ్, శాసన సభ్యులు సత్తి సూర్యనారాయణ రెడ్డి లు ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ అర్హులైన వారికి సంక్షేమ పథకాల ప్రయోజనం కోసం ఆడిటింగ్ చేసే విధానం ద్వారా గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రజలతో మమేకమైనట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలోని ఏఎంసీ చైర్మన్ జంగా వీర వెంకట సుబ్బారెడ్డి, జిల్లా మహిళ సంక్షేమ సంఘ చైర్మన్ రొంగల పద్మావతి, ఎంపీపీ కొవ్వూరి జ్యోతిర్మయి, సర్పంచి వాసంశెట్ట రవికుమార్, ఎంపీటీసీ బొబ్బలి గంగా భవాని, ఉప సర్పంచి కొవ్వూరి సత్యనారాయణ రెడ్డి, ఎంపీడీవో జెఏ ఝాన్సీ , తహసీల్దార్ కె.పోసిబాబు, ఈవో పీఆర్డీ భవాని, పంచాయతీ కార్యదర్శి | సత్తి శ్రీనివాస్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు .
addComments
Post a Comment