*సీనియర్ జర్నలిస్ట్ గోపాల్ రెడ్డి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కమిషనర్ సమాచార శాఖ
*
*జర్నలిస్ట్ సమాజానికి గోపాల్ రెడ్డి మరణం తీరని లోటు*
అమరావతి, సెప్టెంబర్29:
గౌరవ సీనియర్ వెటరన్ జర్నలిస్ట్ మరియు ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు శ్రీ మబ్బు గోపాల్ రెడ్డి గారు రోడ్డు ప్రమాదం లో మృతి చెందడం పై టి విజయ కుమార్ రెడ్డి, కమిషనర్ సమాచార పౌర సంబంధాల శాఖ వారు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తిరుమల బ్రహ్మోత్సవాల కవరేజ్ కు వెళ్ళిన గోపాల్ రెడ్డి కనుమ రోడ్డులో జరిగిన ప్రమాదం లో చనిపోవడం బాధాకరం అన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే కలం యోధుడు గోపాల్ రెడ్డి మరణం తిరుపతి జర్నలిస్ట్ వర్గానికి తీరని లోటు అని అన్నారు. గోపాల్ రెడ్డి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
అంతే కాకుండా సమాచార శాఖ నుండి అందవలసిన సహాయ సహకారాలు అందచేస్తామని తెలియ చేసారు.
addComments
Post a Comment