సంచార జాతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి - జిల్లా కలెక్టర్ బసంత కుమార్

 సంచార జాతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి - జిల్లా కలెక్టర్   బసంత కుమార్*సంచార జాతుల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాలు అర్హులైన లబ్ధిదారులకు అందించేలా అధికారులు చర్యలు తీసుకోండి :-*


*విద్య, వైద్యం, ఉపాధి అట్టడుగున ఉన్న ప్రజలకు అందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది :-*


*జాతీయ సంచార జాతుల కమిషన్‌ సభ్యుడు తుర్క నర్సింహ :-*


*సంచార జాతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, జిల్లాలో సంచార జాతుల అభివృద్ధికి అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా కలెక్టర్  ఆదేశించారు*. పుట్టపర్తి, సెప్టెంబర్ 9 (ప్రజా అమరావతి):   సంచార,  అర్థ సంచార జాతుల అభ్యున్నతికి చిత్తశుద్ధితో కృషి చేయాలని అధికారులకు కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వశాఖ దక్షిణ భారత బోర్డు సభ్యుడు టీ నరసింహ పేర్కొన్నారు .శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ పి. బసంత కుమార్ తో కలసి  బిసి, ఎస్సీ, ఎస్ టి, సంక్షేమం ,పోలీసు, విద్య, వైద్య శాఖ అధికారులతో ఆయన  సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏ ఎస్ పి రామకృష్ణ ప్రసాద్,  ఆర్డిఓ భాగ్యరేఖ , డీఈవో మీనాక్షి, సాంఘిక సంక్షేమ శాఖ అధికారి శివ రంగ ప్రసాద్, ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ

శ్రీ సత్య సాయి  జిల్లా ఏర్పడిన తర్వాత  సంచార జాతుల స్థితిగతులపై సమీక్ష నిర్వహించడం ఇదే తొలిసారి అన్నారు. రాయలసీమ జిల్లా అత్యంత వెనుకబడిన ప్రాంతమని, అందులో మన జిల్లాలో వెనకబడిన వర్గాల అభ్యున్నతికి అధికారులందరూ పాటుపడాలన్నారు. 

సంచార జాతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. విద్యా, వైద్యం, ఆర్థిక, సాంఘిక తదితర రంగాల్లో సంచార జాతులు ముందుకు వెళ్లడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు*. 


*ఈ సందర్భంగా జాతీయ సంచార జాతుల కమిషన్‌ సభ్యుడు తుర్క నర్సింహ మాట్లాడుతూ....కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొస్తున్న సంక్షేమ పథకాలు అట్టడుగున ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్య, వైద్యం, ఉపాధి అనేది అట్టడుగున ఉన్న ప్రజలకు అందితేనే

దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్ర పర్యటనలో దేశమంటే మట్టి కాదోయో.... దేశమంటే మనుషులని అభివర్ణించారని, మానవసేవే... మాధవ సేవ అని, మానవతా దృక్పథంతో అట్టడుగున ఉన్న సంచారజాతుల ప్రజలకు సేవ చేయాలన్నారు.  శ్రీ సత్య సాయి బాబా   జన్మస్థలమైన  ఈ ప్రాంతం   ఎందరో మహనీయులు మానవత్వం గురించి తెలియజేశారన్నారు.కేంద్ర ప్రభుత్వం సంచార జాతుల సంక్షేమం కోసం బోర్డును ఏర్పాటు చేయడంతో పాటు వారి స్థితిగతులను, జీవన అలవాట్లపై నివేదికకు చర్యలు తీసుకుంటుందన్నారు. ఏ దేశంలో అయితే మానవ అభివృద్ధి చెందుతుందో ఆ దేశం ప్రపంచాన్నే శాసిస్తుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నవరత్నాల పేరిట అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఆంగ్ల బోధన, జగనన్న అమ్మబడి, సెంట్రల్ సిలబస్, నిరుపేద పిల్లల కోసం ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ దేశంలోనే అమోఘం అన్నారు. దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి అద్భుతమైన పథకాలను ప్రవేశపెట్టారని, ఆయన మన మధ్యలో లేకపోయినా ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ అద్భుతమైన సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. మానవ వనరులను తయారు చేయడంలో విద్య పాత్ర చాలా అమోఘం అన్నారు. మంచి విద్యా వ్యవస్థ మానవ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ముఖ్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించడంతో పాటు అర్హులను గుర్తించి వారి అభ్యునతికి కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో వారికి సక్రమంగా అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సంచార జాతుల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన అధికారులకు అవగాహన కల్పించారు. సంచార జాతుల పిల్లలందరూ రాబోయే రోజుల్లో ఉన్నత విద్యను అవలీలగా చదువుకునే అవకాశాలు లభించాలన్నది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యమన్నారు. అది నెరవేరితే సంచార జాతుల జీవన విధానం పూర్తిగా మారిపోతుంది. ఆ పిల్లల చదువులు గొప్ప మానవ సంపదగా మారి, దేశ ఆర్థిక వ్యవస్థను మరింత శక్తివంతం చేసేందుకు దోహదపడతాయి అన్నారు. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం, సైన్స్, గణితం, రసాయన శాస్త్రం, సోషియల్ తదితర సబ్జెక్టులలో విద్యార్థులకు ఎలాంటి విద్యా బోధన ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది,  అట్టడుగు వర్గాల పిల్లలు యూపీఎస్సీ నిర్వహించే ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పరీక్షల్లో పోటీపడి తమ లక్ష్యం నెరవేర్చుకునేలా ఉపాధ్యాయులు విద్యార్థులకు చక్కగా అర్థమయ్యేలా బోధన చేయాలన్నారు ఈ  ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ అధికారి నిర్మల జ్యోతి, గిరిజన సంక్షేమ అధికారి మోహన్ రావు, ఫారెస్ట్ అధికారి వెంకటేశ్వరరావు, డి ఆర్  డి ఏ పి డి నరసయ్య, జిల్లాలోని వివిధ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు


Comments