అమరావతి (ప్రజా అమరావతి);
ముఖ్యమంత్రి నివాసంలో సీఎం శ్రీ వైఎస్ జగన్‌ను కలిసిన టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్.
ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చ.
ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామన్న సీఎం, రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను వివరించిన సీఎం.
సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్న సీఎం.
ఈ సమావేశంలో పాల్గొన్న పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, పరిశ్రమల శాఖ స్పెషల్ సీఎస్ కరికాల్ వలవెన్, ఏపీఈడీబీ సీఈవో జవ్వాది సుబ్రహ్మణ్యం, సీఎంవో అధికారులు.
addComments
Post a Comment