___ కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా...
___ పారిశుధ్యం, గృహనిర్మాణంపై ప్రత్యేక దృష్టి
కాకినాడ, సెప్టెంబర్ 16 (ప్రజా అమరావతి):
కాకినాడ నగర పాలక సంస్థ పాలక మండలి సభ్యుల కాలపరిమితి ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం పాలనా పరమైన సేవలు నిమిత్తం ప్రత్యేక అధికారి నియామకం అనివార్యమైంది.
శుక్రవారం నగర పాలక సంస్థ కార్యాలయంలోని మేయర్ ఛాంబర్లో కలెక్టర్ కృతిక శుక్లా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కార్పొరేషన్ ప్రత్యేక అధికారిగా బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వానికి ధన్యవాదములు తెలిపారు. నగరంలో పెండింగ్లో వున్న సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తానన్నారు. ముఖ్యంగా పారిశుధ్య నిర్వహణ, గృహ నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని కృతిక తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ కమీషనర్ కె రమేష్, ఎడిసి సి నాగ నరసింహారావు, అధికారులను సిబ్బందిని పరిచయం చేశారు.
addComments
Post a Comment