మానవ మేధస్సుకు నిలువుటద్దం
మోక్షగుండం విశ్వేశ్వరయ్య
ప్రభుత్వం ద్వారా చేపడుతున్న వివిధ రకాల పనుల్లో నాణ్యత బాగుండేలా చూసుకోవాలి*
సమాజ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు కల్పనలో ఇంజినీర్లది కీలక పాత్ర
జిల్లా అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలి
*: జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్*
పుట్టపర్తి, సెప్టెంబర్ 15 (ప్రజా అమరావతి): సమాజ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు కల్పనలో ఇంజినీర్లు సేవలు కీలకమని జిల్లా కలెక్టర్ బసంత కుమార్ తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని స్పందన వీడియో కాన్ఫరెన్స్ హాలు నందు పంచాయతీరాజ్ శాఖ, మరియు ఆర్డబ్ల్యూఎస్,DwMa ఇంజనీర్ల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇంజినీర్స్ డే వేడుకలలో జిల్లా కలెక్టర్ బసంతకుమార్ ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. కార్యక్రమంలో ముందుగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటానికి పూలదండవేసి నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బసంత కుమార్ మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో భాగస్వాములైన ఇంజినీర్స్ అందరికీ ఇంజినీర్స్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య సేవలు, నీతి ప్రపంచ ఖ్యాతి పొందాయన్నారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని ఆదర్శంగా తీసుకొని దేశఅభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలన్నారు. ఏ అభివృద్ధి కార్యక్రమం లోనైనా ఇంజినీర్స్ సహకారం ఉంటుందన్నారు. సమాజ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు కల్పనలో ఇంజినీర్లు కీలక పాత్ర పోసిస్తారని, మంచి ఇంజినీర్లు కనపరచిన పనితీరు ప్రజల జీవనం లో కనిపిస్తుందన్నారు. మారుమూల గ్రామాలకు రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించాలని, మీ ఉద్యోగ కాలం లో చేపట్టిన పనులను, సేవలను ప్రజలు పదికాలాలు చెప్పుకొనేలా ఉండాలన్నారు. చేపట్టిన పనులలో నాణ్యత ఉండాలని, పనుల నాణ్యత భవిష్యత్తులో కూడా కనిపించాలని తెలిపారు . ప్రభుత్య భవనాలు స్వంత భవనాలుగా భావించి పనులు చేపట్టాలని, కార్యాలయాలు పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. గ్రామాలలో చేపడుతున్న నిర్మాణ పనులను ఇంజినీరింగ్ అసిస్టెంట్లు నిత్యం పర్యవేక్షించాలని, లక్ష్యాలను పూర్తిచేసి జిల్లా అభివృద్ధికి కష్టపడి పనిచేయాలన్నారు. అనంతర
అమృత్ సరోవర్, ప్రభుత్వ ప్రాధాన్యత భవన నిర్మాణం పనులు మరియుఉపాధిహామీ కింద చేపట్టిన వివిధ భవనాల నిర్మాణం, తదితర అంశాలపై ఆయా శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ చేతన్, డిఆర్ఓ కొండయ్య, తదితరులు పాల్గొన్నారు.*
*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్స్, బీఎంసీయు, ఏఎంసీయూ భవనాలు, డిజిటల్ లైబ్రరీల నిర్మాణం వేగవంతం చేయాలన్నారు. ప్రభుత్వం ద్వారా చేపడుతున్న వివిధ రకాల పనుల్లో నాణ్యత బాగుండేలా చూసుకోవడం అత్యంత ముఖ్యమన్నారు. గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, వైయస్సార్ హెల్త్ క్లినిక్స్, బీఎంసీయు, ఏఎంసీయూ భవనాల నిర్మాణం, మొదలయ్యే డిజిటల్ లైబ్రరీల నిర్మాణం ద్వారా గ్రామస్థాయిలో 100 సంవత్సరాలకు సంబంధించి దశ దశ నిర్దేశించే ముఖ్యమైన నిర్మాణాలన్నారు. ఆయా భవనాల నిర్మాణాలకు సంబంధించి పూర్తయిన వాటికి బిల్లుల అప్లోడ్ ఎప్పటికప్పుడు ఎలాంటి పెండింగ్ లేకుండా ఆన్లైన్లో అప్డేట్ చేయాలన్నారు. ఇంతకుముందు ఏ పని కావాలన్నా మండల, జిల్లా, రాష్ట్రస్థాయి ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని, అలా కాకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా వారి ఇంటి ముందరే గ్రామ సచివాలయాలను నిర్మించడం, ఆయా సచివాలయాల్లో 10 నుంచి 15 మంది ఉద్యోగులను ఏర్పాటు చేయడం, మహిళా పోలీస్, వెల్ఫేర్ అసిస్టెంట్, డిజిటల్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ లను ఏర్పాటుచేసి ప్రతి కార్యక్రమానికి నిర్ణీత ఉద్యోగులను తీసుకొచ్చి గ్రామస్థాయిలోనే పూర్తిగా పరిపాలన విధానాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాష్ట్రస్థాయిలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై అధికారులు అవగాహన చేసుకోవాలన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలపై అధికారులు అవగాహన చేసుకుంటే గ్రామస్థాయిలో ఇప్పటివరకు మొదలుకాని పనులు, మొదలైన, బేస్మెంట్ స్థాయిలోనే ఆగిపోయిన పనులు, బేస్మెంట్ వరకు వచ్చి ఆగిపోయిన పనులు, రూఫ్ లేవల్ వరకు వచ్చిన పనులు, పూర్తయ్యే స్థాయికి వచ్చి పూర్తి చేయాల్సిన పనులు ముందుకు వెళ్లే అవకాశం ఉంటుందన్నారు.*
*అమృత్ సరోవర్ పనుల కింద కూలీలకు యావరేజ్ వేజ్ రేటు 210 రూపాయలు మాత్రమే ఇవ్వడం జరుగుతోందని, యావరేజ్ వేజ్ రేటు 240 రూపాయలకు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. వంద రోజుల పని దినాలు పూర్తికాని కుటుంబాలపై దృష్టి సారించి, వారికి వందరోజుల పని దినాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి పనులపై కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా చాలా టీంలు పరిశీలనకు వస్తున్నాయని, వర్క్ క్లోజర్ రిపోర్ట్స్ పై పూర్తిగా దృష్టి పెట్టాలన్నారు. ఉపాధి పనులకు ప్రాధాన్యత ఇచ్చి పనులు చేపడుతున్న ప్రాంతాలలో బోర్డులను ఏర్పాటు చేయాలని, మెడికల్ కిట్ కూడా అందుబాటులో ఉంచాలన్నారు. ఇందులో భాగంగా 7, 8 రకాల రిజిస్టర్లు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుని ఉండాలన్నారు. లేబర్ బడ్జెట్ కు సంబంధించి కేటాయించిన లక్ష్యాన్ని చేరుకోవాలని, పెద్ద ఎత్తున ప్లాంటేషన్ పనులు చేపట్టి పురోగతి చూపించాలన్నారు. లేబర్ బడ్జెట్ లో ఇంకా ముందుకు వెళ్లి, కుటుంబాలకు వందరోజుల పని పూర్తిగా కల్పిస్తే 150 రోజులపాటు కూడా పని కల్పించే అవకాశం ఉందన్నారు.*
*ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రషీద్, పంచాయతీరాజ్ ఎస్ఈ, గోపాల్ రెడ్డి, DWMA పిడి రామాంజనేయులు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.*
addComments
Post a Comment