కుల, మత, వర్గ,పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాల అమలు



 ఈ ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం



 కుల, మత, వర్గ,పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాల అమలు :



 *డిప్యూటీ సి ఎం* 



జిడి నెల్లూరు, సెప్టెంబర్ 29 (ప్రజా అమరావతి):


రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ వారి ఆర్థికాభివృద్ధికి సంక్షేమ పథకాలను అమలు చేయడం జరుగుతున్నదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఎక్సైజ్ శాఖామాత్యులు కె. నారాయణ స్వామి పేర్కొన్నారు.


 గురువారం జి.డి. నెల్లూరు ఎం పి డి ఓ కార్యాలయం ఆవర ణo లో మూడవ విడత వై.ఎస్.ఆర్ చేయూత లబ్దిదారు లకు జి.డి.నెల్లూరు మండలానికి సంబంధించి 3,285 మంది లబ్దిదారులకు రూ.6,15,94,000 ల మెగా చెక్కును అందజేసేందుకు ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఉప ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. 



ఈ సందర్భంగా *ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ....* రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అమలు చేసేందుకు నవరత్నాలను తీసుకునిరావడం జరిగిందని ఇందులో భాగంగా 45-60 సం.ల మధ్య వయసు ఉన్న అర్హులైన ప్రతి ఎస్.సి, ఎస్.టి, బి.సి మరియు మైనారిటీ అక్క చెల్లెమ్మలకు ఒక్కొక్కరికీ సం.నికి రూ.18,750-00 చొప్పున 4 సం. లకు గానూ రూ.75,000-00 ఆర్ధిక సహాయం అందించడంలో భాగంగా మూడవ విడత వై.ఎస్.ఆర్. చేయూత కార్యక్రమాన్ని ఈ నెల 23న కుప్పంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభించడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు సంక్షేమ పథకాల లబ్ధిని మహిళలకు అందేలా పథకాలను అమలు చేయడం జరుగుతున్నదన్నారు. దసరా పండుగ కానుకగా మూడవ విడత వై.ఎస్.ఆర్ చేయూతను జగనన్న మహిళలకు అందిస్తున్నారన్నారు. పేద వారి తలరాతను మార్చేందుకు విద్య తోడ్పడుతుందని అలాంటి విద్యారంగంలో పలు సంస్కరణలను ప్రభుత్వం చేపట్టడం జరిగిందని, అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యాదీవెన, వసతిదీవన లాంటి పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా పేద వారికి వైద్య సేవలను అందిస్తున్నారన్నారు.  కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేయడం జరుగుతున్నదన్నారు. 


 *ఆర్ టి సి వైస్ చైర్మన్ విజయా నంద రెడ్డి మాట్లా డుతూ...* రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారని మహిళలు వారి కుటుంబాలను ఎంత చక్కాగా చూసుకుంటారో అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా పొందే లబ్ది అయిన ప్రతి రూపా యిని సద్వినియోగం చేసుకుంటారనే ఉద్దేశ్యం తో పథకాల లబ్ధిని మహిళలకు చెందేలా ప్రభుత్వం పథకాలను అమలు చేయడం జరుగుతున్నదన్నారు. 


ఈ కార్యక్రమం మొదట జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభం కాగా జి.డి. నెల్లూరు మండలానికి సంబంధించిన చేయూత లబ్దిదారులకు అందించిన మెగా చెక్కు పంపిణీ తో కార్యక్రమం ముగిసింది. 


ఈ కార్యక్రమం లో ఎం పి పి అనిత, జెడ్ పి టి సి లక్ష్మి ప్రియ, ఎంపిడిఓ శ్రీదేవి, తహశీల్దార్ ఇన్బనాథన్, ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. 



ఈ కార్యక్రమంలో *వై.ఎస్.ఆర్ చేయూత లబ్దిదారులైన జి.డి. నెల్లూరు మండలం ఎం. నాసారంపల్లికి చెందిన భూషణమ్మ* ప్రభుత్వ పథకాల ద్వారా తాను పొందిన లబ్ధిని వివరిస్తూ వై.ఎస్.ఆర్ చేయూత కింద మొదటి విడతలో తానూ పొందిన లబ్ధిని తన కుమార్తె గర్భవతిగా ఉండడంతో ఆమె ప్రాణాలను కాపాడగలిగిందని, రెండవ విడతలో పొందిన లబ్ది మరియు సంఘం లో పొందిన ఋణం ద్వారా ఒక ఆవును కొనుగోలు చేసి ఆ ఆవు ద్వారా పొందే పాలను అమ్ముతూ జీవనం సాగిస్తున్నానని, నేడు మూడవ విడతలో పొందే లబ్దిని కూడా సద్వినియోగం చేసుకుంటానని తనకు సంఘం లో సభ్యురాలిగా సున్నా వడ్డీ, ఆసరా పథకాల ద్వారా లబ్ది పొందానని సంతోషం వ్యక్తం చేసారు. 



జి.డి.నెల్లూరుకు చెందిన *మరో లబ్దిదారురాలు రామేశ్వరి* తాను లక్ష్మి స్వయం సహాయక సంఘంలో 10 సం.లుగా సభ్యురాలిగా ఉన్నానని, నా భర్త కార్పెంటర్ పని చేస్తాడని, ఒకప్పుడు నా భర్త బయట పనికి వెళ్ళేవారని, ప్రస్తుతం ప్రభుత్వం ద్వారా పొందుతున్న పథకాల లబ్దితో నేడు జి.డి.నెల్లూరు బ్యాంక్ వీధిలో సొంతంగా దుకాణం పెట్టుకున్నామని, పెద్ద కూతురికి వివాహం చేసామని, రెండవ అమ్మాయికి వసతి దీవెన అందుతున్నదని, వై.ఎస్.ఆర్ చేయూతతో పాటు సున్నా వడ్డీ, ఆసరా, బ్యాంక్ లింకేజి రుణాలు పథకాల ద్వారా పొందిన లబ్ధిని సద్వినియోగం చేసుకున్నామని, మా కుటుంబం మొత్తం జగనన్నకు రుణ పడి ఉందని తెలిపారు.   

        


Comments