క్లోర్ ఆల్కలై"పరిశ్రమల హబ్ గా కాకినాడ : ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవిందరెడ్డి"క్లోర్ ఆల్కలై"పరిశ్రమల హబ్ గా కాకినాడ : ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవిందరెడ్డిఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవిందరెడ్డిని కలిసిన ఆదిత్య బిర్లా ప్రతినిధులు


 గ్రాసిమ్ పరిశ్రమ చుట్టుపక్కల మరింత విస్తరణ దిశగా అడుగులు


అమరావతి,సెప్టెంబర్, 15 (ప్రజా అమరావతి): తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో క్లోర్ ఆల్కలై పరిశ్రమల హబ్ ను ఏర్పాటు చేయనున్నట్లు ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టుగోవింద రెడ్డి వెల్లడించారు. ఆదిత్య బిర్లా ప్రతినిధులు మంగళగిరి ఏపీఐఐసీ కార్యాలయంలో ఛైర్మన్ ని కలిశారు. ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా కాకినాడ బలభద్రాపురంలో గ్రాసిమ్ పరిశ్రమ ప్రారంభం జరిగిన పరిసరాల్లో క్లోర్ ఆల్కలై పరిశ్రమలకు పెద్దపీట వేయనున్నట్లు పేర్కొన్నారు. క్లోర్ ఆల్కలై ప్రక్రియలో కాలుష్యం లేకుండా కాస్టిక్ సోడా తయారవుతుందని ఛైర్మన్ కు వివరించారు. ఫార్మా, ఆక్వా కల్చర్, షుగర్ మిల్స్, వాటర్ సానిటేషన్, హైడ్రోజన్ సార్బిటాల్ ఆధారిత ఉత్పత్తుల్లో క్లోర్ ఆల్కలై కీలకమన్నారు. కాకినాడ సమీపంలోని గ్రాసిమ్ పరిశ్రమ సమీపంలో ఈ దిశగా మరింత విస్తరణకు కసరత్తు చేయడానికి తోడ్పాటునందించాలని ఏపీఐఐసీ ఛైర్మన్ ని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య బిర్లా గ్రూప్ కి చెందిన ప్లాంట్ జాయింట్ హెడ్ ఆర్.జీ. కృష్ణన్, ఫినాన్స్ హెడ్ పవన్ బజాజ్, మేనేజర్ రచిత్ తదితరులు పాల్గొన్నారు.

Comments