పిల్లలందరూ నులిపురుగుల నిర్మూలన మాత్రలు వేసుకోవాలి

 నేను  కూడా ప్రభుత్వ పాఠశాల  విద్యార్థి


పిల్లలందరూ నులిపురుగుల నిర్మూలన మాత్రలు వేసుకోవాలి*


జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్


పుట్టపర్తి, సెప్టెంబర్ 21 (ప్రజా అమరావతి):   నేను కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివి I A S  సాధించడం జరిగిందని జిల్లా కలెక్టర్  బసంత కుమార్ గారు    విద్యార్థులకు పిలుపునిచ్చారు. బుధవారం  పుట్టపర్తి సత్తెమ్మ దేవాలయం సమీపమున   శివాలయం వీధి లో ఉన్న ప్రాథమిక పాఠశాల నందు   మధ్యాహ్న భోజన పథకాన్ని  పరిశీలించారు. కలెక్టర్ దంపతులు విద్యార్థులతో కలిసి  సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో  మున్సిపల్ చైర్మన్  ఓబుల్ పతి, ఎంపిపి రమణారెడ్డి,అనిత కలెక్టర్ గారి శ్రీమతి,  ఆర్డిఓ భాగ్యరేఖ, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు,  అనంతరం జాతీయ నులిపురుగుల దినోత్సవం సందర్భంగా ఆలబెండజోల్ ఆలబెండజూలు మాత్రలు. కలెక్టర్ దంపతులు విద్యార్థులకు వేశారు. అనంతరం అక్కడ జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లల ఆరోగ్యం,  చదువు, క్రీడలు పట్ల ఆసక్తి కలిగి ఉండాలి అని తెలిపారు. చిన్నతనము నుంచి  మంచి పోషకాహారాలు తీసుకోవాలని తెలిపారు. వారానికొకసారి  చేతి గోళ్లు  పరిశుభ్రంగా ఉంచుకోవాలి. గురువులను గౌరవించాలి, నీతి వాక్యాలు, యోగ చిన్నతనం నుండే  ఆసక్తి కలిగి ఉండాలి, ఆహారం నమిలి మింగాలి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు  2-19 సంవత్సరాల వయసు లోపల ఉన్న విద్యార్థులందరు ఒక ఆల్బెండజోల్ మాత్ర వేసుకోవాలని చెప్పారు. 

ఈ మాత్రలు వలన ఏ విధమైన ఇబ్బందులు ఉండవని, ఒక ఏ విధమైన ఇబ్బందులు తలెత్తినా వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు.  నా మనవడికి  ఈరోజు  మీ సమక్షంలో వారికి   ఈ మాత్రలు వేసినట్లు చెప్పారు. విద్యార్థులు ఎవరైనా స్కూల్ కి రాకపోతే వారికి మాత్రలు పంపిణీ చేయాలని, అనంతరం  జడ్పీ హైస్కూల్ నందు, SSS స్కూల్ నందు , పాఠశాలలు , ఒకటి నుండి 19 సంవత్సరాల విద్యార్థులకు ఆలబెండజోల్ ఆలబెండజూలు మాత్రలు నూలు పురుగుల  నివారణ కొరకు   కలెక్టర్ దంపతులు   విద్యార్థులకు   అందజేశారు అందరు విద్యార్థులు ఈ సదా అవకాశాన్ని వినియోగించుకో కోవాలని తెలిపారు

ఈ కార్యక్రమంలో  డీఈవో మీనాక్షి, పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్ రామిరెడ్డి

డాక్టర్ నాగరాజు నాయక్, ,యం ఇ ఒ వెంకట రమణ నాయక్, HM రజనీకాంత్ రెడ్డి,

చెరువు భాస్కర్ రెడ్డి వార్డ్ కౌన్సిలర్,

లక్ష్మీదేవి వైస్ చైర్మన్, గీత వార్డ్ కౌన్సిలర్

పవన్ వార్డు కౌన్సిలర్,

సూర్యనారాయణ వార్డు కౌన్సిలర్,   తదితరులు పాల్గొన్నారు


 

Comments